Asianet News TeluguAsianet News Telugu

కత్రినా, విక్కీ 'రోకా' వేడుక.. ఆ డైరెక్టర్ ఇంట్లో సీక్రెట్ గా ఫినిష్

బాలీవుడ్ అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ పెళ్లిపీటలెక్కే సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది.

Katrina kaif and Vicky kaushal roka function at kbir khan house
Author
Hyderabad, First Published Nov 8, 2021, 9:48 AM IST

బాలీవుడ్ అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ పెళ్లిపీటలెక్కే సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది. కత్రినా బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక ప్రేమవ్యవహారాలు బాగానే నడిపింది. 

సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరోలతో Katrina Kaif ఎఫైర్ సాగించిందనే రూమర్స్ ఉన్నాయి. ఇక రణబీర్ కపూర్ తో ఆమె చాలా కాలం సహజీవనం చేసిందనేది అందరికి తెలిసిన వాస్తవమే. ప్రస్తుతం కత్రినా యంగ్ హీరో Vicky Kaushal తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. ప్రస్తుతం కత్రినా వయసు 38 ఏళ్ళు. ఇక పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి ఎంటర్ కావాలని కత్రినా డిసైడ్ అయింది. 

Also Read: Vishnu Priya:బటన్స్ విప్పేసి యాంకర్‌ విష్ణు మైండ్‌ బ్లోయింగ్‌ షో.. బ్రా మర్చిపోయావా అంటూ దారుణంగా ట్రోలింగ్‌

విక్కీ కౌశల్, కత్రినా వివాహం డిసెంబర్ లో జరుగబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు కత్రినా, విక్కీ కౌశల్ ల 'రోకా' వేడుక దీపావళి సందర్భంగా సీక్రెట్ గా జరిగినట్లు బాలీవుడ్ మీడియా టాక్. రోకా వేడుక అంటే పెళ్ళికి ముందు ఇరు కుటుంబాల సభ్యులు ఒకచోట కూర్చుని అన్ని విషయాలు చర్చించుకునే చిన్న ఫంక్షన్. 

అయితే కొందరు మాత్రం నిశ్చితార్థమే జరిగిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా దీపావళి సందర్భంగా కత్రినా, విక్కీ వివాహానికి సంబంధించిన చిన్న వేడుక జరిగింది. దీని గురించి కత్రినాకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి బాలీవుడ్ మీడియాకు వివరించారట. ఫంక్షన్ అద్భుతంగా జరిగింది. కత్రినా లెహంగాలో మెరిసింది అని చెప్పారట. ఈ వేడుక దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో సీక్రెట్ గా జరిగినట్లు చెబుతున్నారు. కత్రినా.. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఏక్ థా టైగర్, న్యూయార్క్ చిత్రాల్లో నటించింది. కబీర్ ఖాన్ ని కత్రినా సొంత బ్రదర్ లా భావిస్తోందట. అందుకే రోకా వేడుకని ఆయన ఇంట్లో ప్లాన్ చేసుకుంది. 

ఇక వివాహ వేడుక రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ లో ఉన్న ఒక కోటలో జరుగబోతున్నట్లు టాక్. దీనికి కూడా కత్రినా చాలా తక్కువ మంది గెస్ట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట. మొత్తంగా కత్రినా, విక్కీ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios