మహర్షి సినిమాతో బిజీగా ఉన్న మహేష్ నెక్స్ట్ సినిమాను సమ్మర్ లో స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సుకుమార్ ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా కత్రినా కైఫ్ ఆ తరువాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ మొదట్లో బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలో నటించిన అమ్మడు మళ్ళీ టాలీవుడ్ సినిమా చేయలేదు. బాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ పోటీగా ఉన్నా కూడా గట్టి పోటీని ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. 

ఇక రీసెంట్ గా సుకుమార్ ఆమెను కలిసి మహేష్ తో చేయబోయే సినిమా కథను వినిపించాడట. సానుకూలంగా స్పందించిన ఈ బ్యూటీ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని గతంలోనే కత్రినా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మరి వారిద్దరు ఒకే తెరపై ఎపుడు కనిపిస్తారో చూడాలి.