బాలీవుడ్ బయోపిక్ ల జోరు ఏ రేంజ్ లో ఉందొ అందరికి తెలిసిందే. తెరపై ఒక సెలబ్రెటీ జీవితాన్ని చూపిస్తే జనాలు ఎగబడి చూసేస్తున్నారు. మెయిన్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం పరుగుల రాణి పిటి.ఉషా బయోపిక్ ని తెరకెక్కించడానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు టాక్ వస్తోంది. 

అయితే బయోపిక్ లో మొదట్లో ప్రియాంక చోప్రాని అనుకున్నప్పటికి సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు కత్రినా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.  కత్రినా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది. తనకు కథ కరెక్ట్ గా సెట్టయితే నటించడానికి సిద్దమే అంటూ.. ఇంకా కథకు సంతకం చేయకముందే ఆ విషయంపై మాట్లాడటం సరికాదని కత్రినా సమాధానమిచ్చింది. 

గత కొన్ని రోజులుగా బయోపిక్ కి సంబందించిన డిస్కర్షన్లలో కత్రినా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కథ పూర్తిగా సిద్ధమయ్యే వరకు ఆ విషయంపై స్పందించకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు టాక్.