నయనతార,సమంత తో కలిసి సందడిచేస్తున్నాడు విజయ్ సేతుపలి. ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి.. ఇద్దరిమద్య ఇరుక్కుపోయాడు. ఒకరికి ఐలవ్యూ.. మరొకరికి ఐమ్యారీయూ అనిచెపుతున్నాడు.
నయనతార,సమంత తో కలిసి సందడిచేస్తున్నాడు విజయ్ సేతుపలి. ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి.. ఇద్దరిమద్య ఇరుక్కుపోయాడు. ఒకరికి ఐలవ్యూ.. మరొకరికి ఐమ్యారీయూ అనిచెపుతున్నాడు.
క్రేజీ క్యారెక్టర్లతో క్రేజీ స్టార్ గామారిపోయాడు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు, పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేయడానికి కూడా రెడీగా ఉంటాడు విజయ్. అందుకే తెలుగులో ఉప్పెన, తమిళంలో మాస్టర్ లాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో మెరసాడు. విజయ్ సేతుపతికి తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం నయనతార, సమంతతో కలిసి విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ సినిమా కాతువాకుల రెండు కాదల్.
నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా లో క్యారెక్టర్స్ డిఫరెంట్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్ . దాంతో మూవీ ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ.. చేస్తూ ప్రేక్షకులలో అటెన్షన్‌ను క్రియేట్ చేశారు. ఇక రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ కు అద్బతమైన రెస్పాన్స్ వస్తోంది. ఖుషీ లోని పవన్, భూమిక దీపం సీన్‌ను ఈ ముగ్గరు పేరడీ చేస్తూ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఇక ట్రైలర్ స్టార్ట్ అయింది మొదలు ఈ ముగ్గరు మధ్య వచ్చే సన్నివేశాలు ఆధ్యాంతం నవ్వులు పూయిస్తున్నాయి. టైటానిక్ దగ్గర నుంచి బాహుబలి-2 ప్రభాస్, అనుష్క బాణాలు వేసే సీన్స్ ఇలా సినిమాలలో చాలా సిన్స్ ను పేరడీ చేస్తూ డిఫరెంట్‌గా సినిమాను తెరకెక్కించాడు.
ఐ లవ్ యూ టూ, ఐ మ్యారి టూ అంటూ విజయ్ డైలాగ్స్.. ఎక్స్ ప్రెషన్స్అద్భఉతంగా ఉన్నాయి. ఇక సినిమా ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విజయ్ సేతుపతిని ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూడలేదు ఆడియన్స్. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 28న తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతోంది.
