పవన్ పార్టీకి ఒక్క సీటూ రాదు-కత్తి మహేష్

పవన్ పార్టీకి ఒక్క సీటూ రాదు-కత్తి మహేష్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ పంచులు ఇస్తూనే వున్నాడు. ప్రశ్నించడానికే వచ్చిన వాళ్లను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ ఎందుకు అసహనంతో ఊగిపోతున్నారో అర్థం కావట్లేదంటూ తరచూ ఫైర్ అవుతుంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటన నేపథ్యంలో కత్తి మహేష్ సంచలన కామెంట్స్ చఆయన స్థాపించిన పార్టీ ‘జనసేన కాదు.. అది కాపుసేన’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నాకు కులమే కాదు, కుటుంబ భావన కూడా లేదు. నాకు కులాల ఐక్యత ఉన్న అమరావతి కావాలి. అప్పుడే జనసేన ఆశయాలు నెరవేరుతాయని ఉద్వేగంగా ప్రసంగించిన విషయం తెలిసిందే.
 

అయితే పవన్ వ్యాఖ్యలు ఏమాత్రం నమ్మ సఖ్యంగా లేవంటూ.. కుల రాజకీయాలకు వ్యతిరేకం అన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎలా ఉంటారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కుల సమీకరణాలతోటే జరుగుతాయని తెలియదా అంటూ ప్రశ్నించారు.  రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్న పవన్.. కాపు రిజర్వేషన్లకు ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీకి పెయిడ్ ఆర్టిస్ట్‌ లా తయారయ్యాడని.. చంద్రబాబుకు ఎప్పడు అవసరం పడుతుందో అప్పుడు ఈ అజ్ఞానవాసిని తెరపైకి తెస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


తెలుగుదేశం పార్టీని పవర్ లోకి తీసుకు రావడం కోసమే ఈయన పవర్ పనిచేస్తుందని.. రాష్ట్రంలో ఏదైనా బర్నింగ్ టాపిక్ ఉంటే దాని వల్ల ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన పరిస్థితులల్లో ప్రజల మైండ్ సెట్‌ను డైవర్ట్ చేసేందుకు పవర్ స్టార్ ప్రత్యక్షం అవుతున్నారన్నారు. ఆయన చంద్రబాబు పిలిస్తే వస్తారో.. పని అయిపోయిన తరువాత మళ్లీ షూటింగ్‌లకు వెలిపోతారు. ఇదో పెద్ద డ్రామా అంటూ పవన్‌పైన తెలుగు దేశం ప్రభుత్వంపైన విమర్శల దాడి చేశారు కత్తి.

 

అన్నకు అన్యాయం జరిగిందంటూ ఊగిపోతూ మాట్లాడిన వ్యక్తి.. జనానికి జరుగుతున్న అన్యాయం కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పొలిటికల్ ఎంట్రీ అన్నారు. ఆయన ప్రజలకు చేస్తున్న అన్యాయంపై మనం ప్రశ్నిస్తే... అక్కడ నుండి సమాధానం ఉండదు. అసలు ఆయనకు సమాధానం చెప్పడమే రాదు. కేవలం టైం పాస్ పాలిటిక్స్ చేసే నాయకుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉండలేరని.. అసలు 2019 ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుండి పోటీ చేసిన గెలిచే పరిస్థితే లేదన్నారు. అప్పట్లో తన అన్న పెట్టిన ప్రజా రాజ్యం పార్టీకి 18 సీట్లు వస్తే.. జనసేన పార్టీకి రానున్న ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదంటూ జోస్యం చెప్పారు మహేష్ కత్తి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page