మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటడం ఖాయమని ఇప్పటినుండే లెక్కలు వేసేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రూ.270 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమాను రూపొందించారు. చిరంజీవి ఆ మొత్తాన్ని తిరిగిరాబట్టగలరు అంటున్నాడు సినీ విమర్శకుడు కత్తి మహేష్. చిరు నటించిన ఈ సినిమా ఆల్ ఇండియా రూ.500 కోట్లు షేర్ తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సత్తా అంటే ఇదీ.. అంటూ 'సైరా' రూ.500 కోట్లు ఆల్ ఇండియా షేర్ రాబట్టడం పక్కా అంటూ పోస్ట్ పెట్టాడు కత్తి మహేష్. ఇక సినిమా విషయానికొస్తే.. రేపే రిలీజ్ ఉండడంతో చిత్రబృందం ఒకింత టెన్షన్ లో ఉంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క శెట్టి వంటి స్టార్లు నటించారు. అమితి త్రివేది సంగీత దర్శకుడు.