డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. యంగ్ బ్యూటీలు నభా నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలు. పూరి జగన్నాథే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ కు ఇటీవల సరైన సక్సెస్ లేదు. దీనితో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పుంజుకోవాలని భావిస్తున్నాడు. 

బుధవారం రోజు ఇస్మార్ట్ శంకర్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో సినిమా రూపొందించారు. రామ్ లుక్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంది. హీరో తలలో చిప్ పెట్టడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

ఈ ట్రైలర్ పై వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ స్పందించాడు. పూరి జగన్నాథ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూశాను. గోల గోలగా ఉంది. పూరి జగన్నాథ్ బీట్ మిస్సయ్యారో లేక కొత్త బీట్ లోకి వచ్చారో సినిమా విడుదలయ్యాకే తేలనుంది అని కత్తి మహేష్ కామెంట్స్ చేశాడు. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని జులై 18న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.