జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వెండితెరపై నటిగా కూడా సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్షణం - రంగస్థలం సినిమాలతో ఈ భామ టాలీవుడ్ బిజీగా మారింది. ఇకపోతే ఆమె ప్రధాన తారాగణంతో నటించిన కథనం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

అయితే నేడు మహిళా దినోత్సవ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి చేతుల మీదుగా కథనం టీజర్ విడుదల చేశారు. ఇకపోతే సినిమాలో అనసూయ ఒక దర్శకురాలిగా కనిపించబోతోంది. 

ఆమె రాసుకున్న కథనంకు తగ్గటుగా రియల్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ జరగడంతో అనసూయ ఏ విధంగా ప్రమాదాలను ఫెస్ చేసిందనేది సినిమాలో అసలు పాయింట్. టీజర్ లోనే ఈ లైన్ ను క్లియర్ గా చెప్పేశారు. మరి సినిమా జనాలను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి. రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.