పబ్లిసిటీ పేరుతో మన కుర్ర హీరోలు చేస్తోన్న కొన్ని స్టంట్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిన్న జరిగిన 'హిప్పీ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఆనందంలో తన చొక్కా విప్పేసి విసరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నిజానికి టాలీవుడ్ ఈ తరహా వ్యవహారాలు ఎవరూ చేయలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు చేసినప్పటికీ మరే హీరో ఇలాంటి సాహసం చేయలేదు. కానీ తెలుగులో ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న కార్తికేయ ఇలా రెచ్చిపోవడంతో నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరో 'హిప్పీ' సినిమాలో నటిస్తున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తికేయ తన సిక్స్ ప్యాక్ బాడీని ఎక్స్ పోజ్ చేయడంతో.. అతడి ఇంకా 'ఆర్ ఎక్స్ 100' హ్యాంగ్ ఓవర్ నుండి బయటకొచ్చినట్లు లేడని, అత్యుత్సాహం ఎక్కువైందని కామెంట్స్ చేస్తున్నారు.

లక్షలాది మంది టీవీలో చూస్తుండగా ఇలా చేయడం సిగ్గుగా లేదా అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. పబ్లిక్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటించాలని, వైరల్ కావడానికి ఇలా చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.