సుకుమార్ తన `సుకుమార్ రైటింగ్స్`లో రూపొందించిన `కుమార్ 21ఎఫ్`, `ఉప్పెన` చిత్రాలు ఎంతటి సంచలనాలను క్రియేట్ చేశాయో తెలిసిందే. తాజాగా మరో సినిమాని ప్రకటించారు సుకుమార్. కార్తికేయతో, తన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్లతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు.
సుకుమార్ రైటింగ్స్ లో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. అద్భుతమైన కథలనే ఆయన తన బ్యానర్‌పై తెరకెక్కిస్తారు. తాను తీయలేకపోయిన చిత్రాలను తనఅసిస్టెంట్స్ తో తీయించి సక్సెస్ కొట్టడం ఆయన స్టయిల్. `కుమార్ 21ఎఫ్`, `ఉప్పెన` చిత్రాలు ఎంతటి సంచలనాలను క్రియేట్ చేశాయో తెలిసిందే. తాజాగా మరో సినిమాని ప్రకటించారు సుకుమార్. తన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్లతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు.
ఇందులో `ఆర్‌ఎక్స్ 100` హీరో కార్తికేయ హీరోగా నటించబోతుండటం విశేషం. దీంతో కచ్చితంగా కార్తికేయలో మరో హిట్ పడినట్టే అని అంటున్నారు. ప్రస్తుతం కార్తికేయ `చావు కబురుచల్లగా` చిత్రంలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఇందులో కార్తికేయ నటనని చూసిన సుకుమార్ తన బ్యానర్‌లో, తన కథతో సినిమానే తీసేందుకు ముందుకు వచ్చారు. మరి దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు, మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇది నవంబర్‌లో ప్రారంభం కానుందట. కార్తికేయ నటిస్తున్న `చావు కబురు చల్లగా` చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ గెస్ట్ గా పాల్గొని సినిమాపై అంచనాలను భారీగా పెంచారు.
