. కార్తికేయ నటించిన తాజా చిత్రం 'బెదురు లంక 2012. ఈ చిత్రం ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 25) రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కు చెప్పుకోదగిన స్దాయిలో
కార్తికేయ ఓ పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత మళ్లీ అలాంటి హిట్ పడలేదు. హిప్పి, గుణ 369, 90ఎమ్‌ఎల్, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క ఇలా ఏ సినిమా చేసినా భాక్సాఫీస్ దగ్గర నిరాశ ఎదురౌతోంది. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొడతాననే నమ్మతంతో ఉన్నాడు. అందుకోసం ఓ వెరైటీ కథతో ముందుకొచ్చాడీ యంగ్ హీరో . కార్తికేయ నటించిన తాజా చిత్రం 'బెదురు లంక 2012. ఈ చిత్రం ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 25) రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కు చెప్పుకోదగిన స్దాయిలో బజ్ లేదు. ఈ క్రమంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఏ మేరకు జరిగిందో చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.75 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 4.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 85 లక్షలు మాత్రమే అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 4.10 కోట్లు బిజినెస్‌ను మాత్రమే చేసింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అయితే సినిమాకు బాగుందనే టాక్ వస్తే ఈ వీకెండ్ లోనే ఈ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.పెద్ద కష్టమేమీ కాదు.
2012 యుగాంతం నేపథ్యంలో ఒక పల్లెటూరులో జరిగిన సంఘటనల ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ బెదురులంక సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలకు సంబంధించి బెదురులంక టీమ్ మూవీ లవర్స్‌కు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. తమ సినిమా టికెట్ ధరలను తగ్గించినట్లు అధికారికంగా తెలిపింది. సవరించిన ధరల ప్రకారం మల్టీప్లెక్స్‌ల్లో రూ. 350 టికెట్‌ను రూ. 250కు, రూ. 295 టికెట్‌ను రూ. 200కు, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 టికెట్‌ను రూ. 150కు, రూ. 150 టికెట్‌ను రూ. 110కు, రూ. 80 టికెట్‌ను రూ. 50కు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
బెదురులంక సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ సినిమాను నిర్మించారు. కార్తికేయ, నేహాతో పాటు ఎల్బీ శ్రీరామ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గోపరాజు రమణ, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శీను తదితరులు నటించారు. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
