Asianet News TeluguAsianet News Telugu

"భజే వాయు వేగం"హార్డ్ డిస్క్ ట్విస్ట్.. కంటెంట్ మాయమైందిట,

ఈ విష‌యం హీరో కార్తికేయకు తెలిస్తే టెన్ష‌న్ ప‌డ‌తాడ‌ని ఆయ‌న‌కు చెప్ప‌కుండా విష‌యాన్ని దాచి ఉంచారట. ఆ హార్డ్ డిస్క్ కు మ‌రమ‌త్తులు చేయించి

Kartikeya Bhaje Vaayu Vegam face A hard disk issue ?
Author
First Published May 30, 2024, 11:24 AM IST


 హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం. రేపు శుక్రవారం రిలీజ్ కానున్న ఈ సినిమాపై కార్తికేయ చాలా ఎక్సపెక్టషన్స్ పెట్టుకున్నారు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అయితే ఈ సినిమా రిలీజ్ లేటు అవ్వటానికి ఓ ఆశ్చర్యకరమైన కారణం ఉంది. అదే హార్డ్ డిస్క్ సమస్య.

ఈ చిత్రం  షూటింగ్  పూర్తి అయ్యాక ఎడిటింగ్ చేసిన కాపీ ఉన్న హార్డ్ డిస్క్ లో సమస్యలు వచ్చాయి. దాంతో మొత్తం ఫుటేజ్ మాయిమైందిట. ఎడిట్ చేసిన ఫుటేజ్ మాయం అవ్వ టంతో ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ క్రియేటే అయ్యిందిట. ఇలా ఊహించని విధంగా  త‌లెత్తిన స‌మ‌స్య వ‌ల్ల టీమ్ కొన్ని నెల‌ల పాటూ ఎంతో ఆందోళ‌నగా గడిపింది. అయితే  ఈ విష‌యం హీరో కార్తికేయకు తెలిస్తే టెన్ష‌న్ ప‌డ‌తాడ‌ని ఆయ‌న‌కు చెప్ప‌కుండా విష‌యాన్ని దాచి ఉంచారట. ఆ హార్డ్ డిస్క్ కు మ‌రమ‌త్తులు చేయించి దాన్ని ఓ కొలిక్కి తెద్దామనుకున్నా కుదరలేదట.

దాంతో మొత్తం రా ఫుటేజ్ తీసుకుని రీ ఎడిట్ చేసారట. అయితే అదృష్టం రా ఫుటేజ్ కు ఏ ఇబ్బంది కలగలేదు. అలా జరిగితే చేయిగలిగింది ఏమి ఉండదు అంటున్నారు. ఎడిట్ అయిన కాపీకి ఇలాంటి ప్రాబ్ల‌మ్ వ‌చ్చి దాన్ని తిరిగి పొంద‌డం చాలా ల‌క్కీ అని చెప్పాలి. లేదంటే చాలా పెద్ద ప్రాబ్ల‌మ్ అయ్యేది అంటోంది టీమ్.  

కార్తికేయ మాట్లాడుతూ... "భజే వాయు వేగం" సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్‌కు సరైన మూవీ. హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని సాల్వ్ చేసుకునేందుకు ఎంచుకునే మార్గాలు.. ఇవన్నీ ఇన్స్‌ఫైరింగ్‌గా ఉండాలని భావిస్తా. అప్పుడే ఐడియల్ అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సోషల్ కన్సర్న్ ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మంచి ఎంటర్ టైన్‌మెంట్ కూడా సినిమాలో ఉంటుంది.
 
ఇలాంటి చిత్రంలోనే నేను నటించాలని కోరుకున్నాను. ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ఈ కథ దర్శకుడు ప్రశాంత్ చెప్పినప్పుడు కార్తి హీరోగా నటించిన ఖైదీ టైపులో ఊహించుకున్నాను. ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు. కానీ, అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు ఒక ప్రాబ్లమ్, అతనికుండే ధైర్యం ఇలాంటి ఫ్రేమ్‌లో కథ ఉంటుంది. సెకండాఫ్‌లో రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది.
 
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న భజే వాయు వేగం సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్‌తో పాటు తన కెరీర్ విశేషాలను ఇంటర్వ్యూలో తెలిపారు హీరో కార్తికేయ గుమ్మకొండ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios