దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలో విలన్ పాత్రలను బలంగా చూపిస్తుంటాడు. ఆ పాత్ర ద్వారానే హీరోని హైలైట్ చేస్తుంటాడు. అందుకే రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలు మంచి పేరొస్తుంటుంది. 

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలో విలన్ పాత్రలను బలంగా చూపిస్తుంటాడు. ఆ పాత్ర ద్వారానే హీరోని హైలైట్ చేస్తుంటాడు. అందుకే రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలు మంచి పేరొస్తుంటుంది. ఇప్పుడు ఆయన తనయుడు కార్తికేయ కూడా తండ్రినే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కార్తికేయ నిర్మాతగా 'ఆకాశవాణి' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇదొక పీరియాడికల్ ఫిల్మ్ అట. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ఇందులో హీరో కంటే విలన్ పాత్ర చాలా కీలకమట. ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కన్నడ, మలయాళ చిత్రాలలో నటించి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోని 'ఆకాశవాణి'లో విలన్ గా తీసుకోబోతున్నారట. '

రాజమౌళి స్వయంగా సదరు స్టార్ హీరోని విలన్ గా నటించమని అడిగినట్లు తెలుస్తోంది. రాజమౌళి అడగడంతో సదరు హీరో.. విలన్ రోల్ కి అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతానికి అతడెవరనేది సస్పెన్స్ గానే ఉంచారు. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది.