హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 పై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ చూశాక అవి మరింతగా పెరిగాయి. నేడు విడుదలైన కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది.
దర్శకుడు చందు మొండేటి కార్తికేయ చిత్రంతో బంపర్ హిట్ కొట్టారు. 2014లో ఆయన డెబ్యూ మూవీగా విడుదలైన కార్తికేయ ప్రేక్షకులను అబ్బురపరిచింది. హీరో నిఖిల్ కి బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ సిద్ధం చేశారు. నిఖిల్(Nikhil), అనుపమ ప్రధాన పాత్రలు చేస్తుండగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక రోల్ చేస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న కార్తికేయ 2(Karthikeya 2) చిత్ర ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా నేడు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠరేపుతూ సాగింది. సైన్స్, ఫాంటసీ మిక్స్ చేసి ఓ మిస్టీరియస్ అడ్వెంచరస్ మూవీగా దర్శకుడు చందూ మొండేటి తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది. ట్రైలర్ లో విజువల్స్ అద్భుతం. ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో భారీగా తెరకెక్కించారు. కార్తికేయ 2 పక్కా కమర్షియల్ సక్సెస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆగస్టు 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
ఇప్పటికే రెండు సార్లు మూవీ విడుదల వాయిదా పడింది. మేకర్స్ తో పాటు ప్రేక్షకులు కార్తికేయ 2 థియేటర్స్ లోకి రావాలని కోరుకుంటున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.
