స్వామిరారా సినిమా తరువాత యువ కథానాయకుడు నిఖిల్ కార్తికేయ సినిమాతో డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ చందు మంచి స్నేహితులను ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. 

ఇక చాలా కాలం తరువాత సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. గతంలోనే కార్తికేయ సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధమని హీరో నిఖిల్ బహిరంగంగానే చెప్పాడు. కాని అప్పుడు దర్శకుడు ఇంకా కథను సెట్ చేయలేదు. ఫైనల్ గా చందు ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలిసింది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తేవాలని ఈ కాంబో ప్లాన్ చేస్తోంది. 

ప్రస్తుతం నిఖిల్ తన నెక్స్ట్ సినిమా అర్జున్ సురవరం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఇకపోతే దర్శకుడు చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఎలాగైనా ఇప్పుడు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని ఈ ఇద్దరు సిద్ధమవుతున్నారు.