Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ దూకుడు.. రెండు రోజుల్లోనే ఇంత కలెక్షనా?

‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నిఖిల్  మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాడు. తెలుగు స్టేట్స్, హిందీ బెల్ట్ లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేస్తోంది. 

Karthikeya 2 Movie good Collections at the US box office in two days
Author
Hyderabad, First Published Aug 15, 2022, 4:08 PM IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ’కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ లో నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించారు.  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తీకేయ 2’కు ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. బలమైన కథ, నిఖిల్ నటన, విజువల్ ఎఫెక్ట్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా పర్లేదు అనిపించుకుంటోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే సేఫ్ జోన్ దగర్లోకి వచ్చింది.  ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోనున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.10 కోట్ల మేర షేర్స్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.13 కోట్టు అవడంతో ఈ రోజు బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయ్యి.. రేపటి నుంచి లాభాల బాటలో పయనించనుంది. ఇదిలా ఉంటే.. అటు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘కార్తీకేయ 2’ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా వచ్చిన చిత్రాల్లో ఈ మూవీ మంచి రెస్పాన్స్ తో, అసలైన వసూళ్లతో దూసుకుపోతోందని మేకర్స్ తెలిపారు. చిత్రాన్ని తొలిరోజు యూఎస్ లో సాలిడ్ ఓపెన్సింగ్స్ రాగా.. తాజాగా యూఎస్ఏ లో 1000కి పైగా షోస్ అమ్ముడు పోయాయి. కేవలం రెండు రోజుల్లోనే 4.5 లక్షల డాలర్ల గ్రాస్ ను రాబట్టింది. ఇంకా కాసుల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది.

చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లే దొరకని, తదితర సమస్యల్ని ఎదుర్కొని మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుండటం విశేషం. ఇటు తెలుగు స్టేట్స్, అటు ఓవర్సీస్ లోనూ నిఖిల్ ‘కార్తీకేయ 2’తో తన మార్క్ చూపిస్తున్నాడు. అయితే తమకు ఇంతటీ సక్సెస్ ను అందిస్తున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా యూఎస్ లోని ఇండియన్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం కార్తీకేయ 2కు ఏ చిత్రం పోటీలో లేదు. మరో పది రోజుల వరకు హవా మొత్తం ఈ చిత్రానిదే. ఆగస్టు 25న ‘లైగర్’ రిలీజ్ తో కాస్తా జోరు తగ్గే అవకాశం ఉంది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios