యువ హీరో నిఖిల్ మళ్ళీ చాలా కాలం తరువాత స్ట్రగుల్ అవుతున్నాడు. స్వామి రారా సినిమాతో ఒక లెవెల్లో కెరీర్ సెట్ చేసుకుంటూ డిఫరెంట్ ప్రాజెక్టులను ఎంచుకున్నాడు. ప్రయోగాలు మొన్నటి వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ కిర్రాక్ పార్టీ సినిమా నుంచి మనోడి క్రేజ్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి.  

అర్జున్ సురవరం సినిమా పూర్తయినప్పటికీ ఇంకా రిలీజ్ కులం నోచుకోవడం లేదు. సమస్య ఏమిటోగాని మొన్నటివరకు రిలీజ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన నిఖిల్ చేసేదేమి లేక మరో ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టాడు. కెరీర్ కి యూ టర్న్ ఇచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ ని సెట్స్ పైకి తేవడంలో బిజీ అయ్యాడు. 2014లో చందు మొండేటి దర్శకత్వం వచ్చిన కార్తికేయ చిత్ర యూనిట్ మొత్తానికి ఎంతో కలిసొచ్చింది. 

అయితే దర్శకుడు హీరో ఇప్పుడు మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావడానికి అదే ఫార్మాట్ లో ప్రయోగం చేస్తున్నారు, ఊహించని ట్విస్టులతో మంచి కాన్సెప్ట్ సెట్ చేసుకున్న చందూ ఫైనల్ స్క్రిప్ట్ ను మరికొన్ని వారాల్లో ఫినిష్ చేయనున్నాడట. ఇక సినిమా కోసం హీరోయిన్ ని అలాగే నటీనటులను వీలైనంత త్వరగా సెలెక్ట్ చేసుకొని అక్టోబర్ లో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. మరి ఈ సీక్వెల్ నిఖిల్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.