యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ (Karthikeya 2) కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూ తెలుగు సినిమా సత్తాను చూపిస్తోంది. తాజాగా కలెక్షన్స్ పై మేకర్స్ అఫిషియల్ అప్డేట్ అందించారు.
భిన్న కథలతో ఆడియెన్స్ ను అలరిస్తున్న యంగ్ హీరో నిఖిల్ (Nikhil) తాజాగా ‘కార్తికేయ 2’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి వారం పూర్తయ్యే వరకు ఓవర్సీస్ లో ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. తాజాగా మేకర్స్ చిత్ర కలెక్షన్స్ పై అఫిషియల్ అప్డేట్ అందించారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎపిక్ బ్లాక్ బాస్టర్ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మొదటి వారం పూర్తయ్యే వరకు వన్ మిలియిన్ డాలర్స్ (1Million Dollars)ను క్రాస్ చేసింది. ప్రస్తుతం ఒక వీకెండ్ లోనే ఇంతటి వసూళ్లను సాధించిన రీసెంట్ సినిమాల్లో ‘కార్తికేయ 2’ ముందు వరుసలో నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. ఇటు చిత్ర యూనిట్ కూడా యూఎస్ఏలో వస్తున్న రెస్పాన్స్ పై ఫుల్ ఖుషీ అవుతోంది. చివరి అప్డేట్ ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. మరో మూడు రోజుల్లో ‘లైగర్’ రిలీజ్ అవుతుండగా ఆ తర్వాత నుంచి ఈ చిత్రం కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉన్నాయి.
తెలుగు స్టేట్స్ తో పాటు.. నార్త్ లోనూ ‘కార్తీకేయ 2’ దూకుడు ఇంకా కొనసాగుతోంది. కలెక్షన్స్ లోనూ చిత్రం బాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తోంది. ప్రస్తుతం అక్కడ రిలీజ్ అయిన చిత్రాలు బైకాట్ కు గురికావడం ‘కార్తికేయ’కు కలిసి వచ్చింది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నిఖిల్ సిద్ధార్థ - అనుపమా పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
