Asianet News TeluguAsianet News Telugu

`కార్తికేయ2` నాలుగు రోజుల కలెక్షన్లు..ట్రేడ్‌ వర్గాలకు మైండ్‌ బ్లాక్‌

`కార్తికేయ2` చిత్ర బృందం ప్రకటించిన కలెక్షన్లు ఆశ్చర్య పరుస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం విశేషం.

karthikeya 2 four days worldwide collections trade in shock
Author
Hyderabad, First Published Aug 17, 2022, 9:26 PM IST

నిఖిల్‌(Nikhil) హీరోగా నటించిన `కార్తికేయ2`(Karthikeya 2) చిత్రం భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ప్రారంభం నుంచి హిట్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రేడ్‌ వర్గాలకు షాకిస్తుంది. ఊహించని కలెక్షన్లతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా చిత్ర బృందం ప్రకటించిన కలెక్షన్లు ఆశ్చర్య పరుస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం విశేషం. చిత్ర బృందం బుధవారం ఈ సినిమా కలెక్షన్లని వెల్లడించింది. 

`కార్తికేయ 2` (Karthikeya 2 Collections) సినిమా నాలుగు రోజుల్లో 35.1కోట్లు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో నిర్మాతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తక్కువ బడ్జెట్‌తో బెస్ట్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు చందూ మొండేటి. నిఖిల్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషించారు. `కార్తికేయ`కి సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. ఆగస్ట్ 13న విడుదలైందీ సినిమా. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదలైంది. 

అయితే తెలుగుతోపాటు హిందీలో ఈ సినిమా కలెక్షన్ల దుమ్ములేపుతుంది. హిందీలో ఈ సినిమా మొదటి రోజు యాభై థియేట్లలో విడుదలైంది. రెండో రోజుల200 థియేటర్లు, మూడో రోజు 700థియేటర్లు, నాల్గో రోజు 1228 థియేట్లు పెరిగాయి. మొదటి రోజు ఏడు లక్షలు వసూలు చేయగా, రెండో రోజు 28 లక్షలు, మూడో రోజు రూ.1.10కోట్లు, నాలుగో రోజు 1.28కోట్లు రాబట్టింది. రోజు రోజుకి థియేటర్లు పెరగడంతోపాటు కలెక్షన్లు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల్లో అక్కడ 2.73కోట్లు రాబట్టడం విశేషం.

 `పుష్ప` చిత్ర తరహాలోనే నార్త్ లో సత్తా చాటడం విశేషం. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి ఈ స్థాయి రెస్పాన్స్ రావడంతో ట్రేడ్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా సక్సెస్‌ గురించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, `పుష్ప` సినిమా ఉదహరించారు. మరోవైపు `అఖండ`తో పోల్చుతూ `ఆ సినిమాని చూసినప్పుడు శైవం మీద, శివత్వం మీద అంత పీక్‌  స్టేజి కి ఆ సినిమా ఎమోషన్ ను తీసుకెళ్లారు. ఇంకో రెండు మూడు ఏళ్ళల్లో విష్ణువు బేస్ గా తీసుకుని సినిమా చేస్తారు అని ఉహించి చర్చలు కూడా జరిపాను. అటువంటిది ఒక ఏడాది తిరగకముందే విష్ణు తత్త్వం మీద సినిమా రావడం చాలా బాగుంది. మధ్య మధ్యలో యానిమేషన్ లో చూపిస్తూ మళ్ళీ పిక్చర్ లో తీసుకెళ్లడం బాగుందని చందు మొండేటిని కొనియాడారు  అల్లు అరవింద్. 

సినిమా అంటే అమ్మాయి అబ్బాయి మధ్య రొమేన్స్ మాత్రమే కాకుండా, ఒక అమ్మాయి అబ్బాయి ఒక కాజ్ కోసం పరిగెడితే చాలు మనం కూడా వాళ్ళ వెనుక పరిగెడతాం అనిపించిందని తెలిపారు. ఒక అడ్వెంచర్స్ ఫిలిం కు ఒక పౌరాణిక బేస్ ఇచ్చి మళ్ళీ దానిని కలికాలంలో కి తీసుకొచ్చారని అల్లు అరవింద్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రేపు 1500ప్లస్‌ థియేటర్లు నార్త్ లో పెరగడం విశేషం. చూడబోతుంటే మున్ముందు ఇది కలెక్షన్లు సునామీ సృష్టిస్తుందని చెప్పొచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios