premi vishwanth: వంటలక్కకు అలాంటి స్కిన్ అలర్జీ.. కార్తీకదీపం సీరియల్ లో మేకప్ వల్లే ఈ సమస్యలు!
premi vishwanth: సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు మేకప్ లేకుండా సినిమాలు చేయటం అనేది కుదరదు. అయితే కొన్ని కొన్ని సార్లు మేకప్ వల్ల నటీనటులకు స్కిన్ కి సంబంధించిన సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. అలానే వంటలక్క కూడా బ్లాక్ మేకప్ వల్ల స్కిన్ కు సంబంధించి సమస్య వచ్చింది.
అయితే ఇటువంటిదే వంటలక్కకు కూడా ఎదురయింది. వంటలక్క అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే సీరియల్ కార్తీకదీపం. స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసుకుంది. ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఇందులో నటించిన నటీనటులను మాత్రం ప్రేక్షకులు మర్చిపోవడం లేదు. అందులో కీలక పాత్రలో నటించిన వంటలక్క మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గర చేసుకుంది.
మలయాళీ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. కార్తిక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన భాషలో కూడా పలు సినిమాలలో, సీరియల్స్ లలో నటించింది. అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల మర్చిపోనీ నటిగా మిగిలిపోయింది. ఆ సీరియల్ లో తన పాత్రతో ఎంత మార్కులు సంపాదించుకుందో చూసాం.
ఇదంతా పక్కన పెడితే గతంలో వంటలక్కకు స్కిన్ అలర్జీ వచ్చిందని తెలిసింది. అసలు ఏం జరిగిందంటే.. ఆమె ఆ సీరియల్ లో నలుపు రంగులో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు బ్లాక్ మేకప్ వేయటం వల్ల ఫేస్ కి కొన్ని మచ్చలు, మొటిమలు కూడా వచ్చాయి. దానివల్ల ఆమె బాగా ఇబ్బంది పడటం వల్ల స్పెషల్ స్కిన్ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్లి కొంత కాలం ట్రీట్మెంట్ చేయించుకుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా తన సమస్య పూర్తిగా తగ్గిపోయింది.