చాలా కాలంగా ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి తెలంగాణా రాష్ట్రంలో గ్రీన్ ఇండియా క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీక దీపం (Karthika Deepam) ఫేమ్ నటి అర్చన అనంత్ తండ్రి అనంత్ వేలు తో కలిసి మొక్కలు నాటారు.  

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్కు లో తన తండ్రి కన్నడ నటుడు అనంత వేలు తో కలిసి మొక్కలు నాటిన కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నటి అర్చన అనంత్(సౌందర్య)....

ఈ సందర్భంగా అర్చన అనంత్ (Archana Ananth)మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన తండ్రితో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు.ఇందులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం నటుడు అనంత వేలు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.భూమాతకు ఆభరణం పచ్చదనం అని ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటి పచ్చదనం తో నింపాలని కోరారు.మంచి ఆక్సిజన్ లభించాలన్న ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అర్చన,అనంత వేలు పిలుపునిచ్చారు.

ఇక చాలా కాలంగా ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి తెలంగాణా రాష్ట్రంలో గ్రీన్ ఇండియా క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సినిమా స్టార్స్ ని, రాజకీయ నాయకులను భాగం చేస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. ప్రభాస్(Prabhas) సంతోష్ కుమార్ కోరిక మేరకు అడవిని దత్తత తీసుకున్నారు. తాజాగా కింగ్ నాగార్జున సైతం వేయి ఎకరాల ఫారెస్ట్ ఏరియా అభివృద్ధి కోసం సంతోష్ కుమార్ తో చేతులు కలిపారు. ఆయన సదరు ల్యాండ్ దత్తత తీసుకున్నారు.