కార్తీకదీపం 2 (karthika deepam 2) లేటెస్ట్ ఎపిసోడ్ లో శివన్నారాయణ జ్యోపై ఫైర్ అవుతారు. దశరథ కూడా జ్యోను తప్పుబడతారు. కార్తీక్ వల్లే కోట్ల రూపాయలు నష్టం రాకుండా బయటపడ్డామని వారు చెబుతారు.
కార్తీకదీపం టుడే ఎపిసోడ్ శివన్నారాయణ కార్తీక్ తో మాట్లాడుతూ మొదలవుతుంది. అగ్రిమెంట్ పేపర్ తీసుకొని కార్తీక్ ను వెళ్లిపోమని చెబుతాడు శివన్నారాయణ. ఆ సమయంలోనే జ్యో మెడ పట్టుకొని బయట గెంటేయాలని అంటుంది. దానికి శివన్నారాయణ జ్యోపై అరుస్తాడు. ‘ఈ మాట అనే అర్హత నీకుందా? నువ్వు అసలు మనిషివేనా? నీకు బుద్ధి ఉందా?’ అంటూ ఫైర్ అవుతాడు. ఈ లోపు సుమిత్ర ‘వేలం పాటను ఆపి మనకు నష్టం తీసుకొచ్చింది కార్తీక్. అతడిని తిట్టకుండా జ్యో అంటారేంటి’ అని ప్రశ్నిస్తుంది. శివన్నారాయణ.. దశరథతో ఎవరు నష్టం రాకుండా ఆపారో అందరికీ తెలిసేలా చేయమని చెబుతాడు. వెంటనే దశరథ వైరాకు కాల్ చేస్తాడు. ‘10 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని.. 20 కోట్ల వరకు పాడేలా చేసింది నువ్వే. నేను ఆపేద్దామనుకునేలోపే నువ్వు నీ కూతురుతోనే ఆపించి దెబ్బ కొట్టావని’ వైరా అంటాడు. ఏం చేసుకుంటావో చేసుకో అని చెబుతూ దశరథ్ కాల్ కట్ చేస్తాడు.
ఏం జరిగిందో చెప్పిన దశరథ
దశరథ్ అసలు ఏం జరిగిందో ఇంట్లో వారందరికీ చెబుతాడు. ‘కార్తీక్ ను వేలంపాట దగ్గరే ఉండమని మేమే చెప్పాము. 10 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీని.. వైరా తెలివిగా 19 కోట్ల వరకు జ్యోత్స్నతో పాడించాడు. జ్యోని కూడా తానే గెలవాలనే పట్టుదలతో 21 అనేలా తయారైంది. అలా జరిగితే మనకు 11 కోట్ల నష్టం వచ్చేది. ఆ టైంలోనే కార్తీక్ ఫోన్ చేసి నాకు చెప్పాడు’ అని దశరథ వివరిస్తాడు. ఆ సమయంలోనే కార్తీక్ తాను ఫేక్ కాల్ చేసి జ్యో ను ఆపించానని కార్తీక్ చెబుతాడు.
అదే సమయంలో జ్యో మాట్లాడుతూ వైరా ఎవరో నాకు తెలియదని, వచ్చీ రాగానే వార్నింగ్ ఇచ్చాడని, అందుకే అంత పోటీపడి పాడాను అని చెబుతుంది. బావ ఆపకపోయినా కూడా తానే ఆపేస్తానని అంటుంది. వెంటనే దశరథ కలగజేసుకొని సిగ్గు లేకుండా నువ్వు ఎలా సమర్థించుకుంటున్నావ్, నీవల్ల కంపెనీకి ఎంతో నష్టం వచ్చేది అని అంటాడు. వెంటనే శివన్నారాయణ కూడా జ్యో పై ఫైర్ అవుతాడు. నిన్ను నేను సీఈవో ఎలా చేశానో అర్థం కావడం లేదని అంటాడు.
శివన్నారాయణ కార్తీక్‌తో మాట్లాడుతూ ‘నీలాంటి తెలివైనోడిని డ్రైవర్ గా ఉంచుకోలేము. అగ్రిమెంట్ తీసుకొని వెళ్ళిపో. ఈరోజు 11 కోట్ల నష్టం రాకుండా కాపాడావు అంటే నువ్వు కట్టాల్సిన డబ్బు కట్టినట్లే. నీ భార్యని తీసుకొని వెళ్ళు’ అని చెబుతాడు. దానికి కార్తీక్ పెద్ద మేడం చెబితేనే వెళ్తానని అంటాడు. కానీ జ్యో మాత్రం కార్తీక్ ని పంపించేందుకు ఒప్పుకోదు. పెద్ద మేడం వెళ్లిపోమని చెబితేనే వెళ్తానని కార్తీక్ అంటాడు. దీప మాట్లాడుతూ మా బావ ఎవరికైనా మాటిస్తే దానికోసం ఏదైనా వదులుకుంటాడు అని అంటుంది.
కార్తీక్ దాచిన రహస్యం
అదే సమయంలో సుమిత్ర కార్తీక్ తో మాట్లాడుతూ ‘నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు. చాలా తెలివైన వాడివి అగ్రిమెంట్ రద్దు చేసుకోవడానికి వచ్చిన అవకాశాలు వదులుకొని ఎందుకు ఊడిగం చేస్తున్నావు? డ్రైవర్ గానే ఎందుకు ఉండిపోతున్నావు’ అని ప్రశ్నిస్తుంది. దానికి కారణం నీ కూతురి కోసమే అత్త అని చెబుతాడు కార్తీక్. ఎందుకు? ఏంటి? అనే ప్రశ్నలకు అతి త్వరలోనే సమాధానాలు దొరుకుతాయని అంటాడు. అదే సమయంలో జ్యో వస్తుంది. నీ కూతురు కోసమే అంటున్నావు కదా ఏంటి విషయం అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ నీకు బుద్ధి చెప్పడానికి అనే సమాధానం ఇస్తాడు. మధ్యలో పారిజాతం కల్పించుకుంటుంది. రెండిటికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తుంది. వెంటనే కార్తీక్ ఈ పెద్ద మేడం సుమిత్ర మేడం కూతురు కాదా అని ప్రశ్నిస్తాడు. వెంటనే పారు కంగారు పడిపోతూ ‘సుమిత్రా నవమాసాలు మోసి మరీ జన్మనిచ్చింది. నేనే పక్కన ఉన్నాను’ అని అంటుంది. కార్తీక్ ‘పాలు పట్టడం, ఊయల మార్చడం, ఊయలలో వేయడం’ అని అనగానే పారు కంగారు పడిపోతుంది. ఈలోపు జ్యో విషయం ఏంటో చెప్పాలని అడుగుతూనే ఉంటుంది. కానీ కార్తీక్ మాత్రం కూల్ గా ఇప్పుడే ఇంటర్వెల్ వచ్చింది, మనం తెలుసుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. ప్రతి సీను క్లైమాక్స్ లాగే ఇకపై ఉండబోతోంది అని అంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ తింటుంది. దీంతో ఈరోజు కార్తీకదీపం ఎపిసోడ్ ముగిసిపోతుంది.
