రజినీకాంత్ దగ్గరకు ఆటోగ్రాఫ్ కోసం వెళితే సినిమా అవకాశం దక్కిందట. ఈ విషయాన్నీ కార్తీక్ ఇటీవల తెలియజేశాడు. ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ జిగర్ తండా తో రజినీని ఎక్కువగా ఆకర్షించాడు. ఒకరోజు లింగా సినినా సెట్స్ లో ఉండగా రజినీకాంత్ ను కలుసుకున్నట్లు చెప్పాడు. 

అయితే తన సినిమాలో ఒక విలన్ రోల్ మీ పాత్రల స్ఫూర్తి నుంచి తీసుకున్నదే అని చెప్పగా రజినీకాంత్ గారు నన్నే తీసుకోవచ్చు కదా అని నవ్వుతు అన్నారు. ఇక ఫొటో తీసుకొని అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఆటోగ్రాఫ్ తీసుకోవడం మర్చిపోయా. ఆ తరువాత ఆయనకు ఖాళీ సమయం దొరకదని ఆటోగ్రాఫ్ కోసం నా డైరీని పంపగా రజినీకాంత్ గారు కొంత గ్యాప్ దొరగ్గానే నన్ను పిలిచారు. 

మంచి స్క్రిప్ట్ ఉంటె చూడు కలిసి చేద్దాం అని చెప్పడంతో నేను ఉహించలేకపోయాను. వెంటనే పేట్ట కథ చెప్పగానే ఒప్పుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కేందుకు ఆలస్యమయింది. కానీ ఫైనల్ గా ఇప్పుడు నా కల నెరవేరిందని కార్తీక్ సుబ్బరాజ్ వివరణ ఇచ్చాడు.