ప్రభాస్ కి అబద్దం చెప్పాడా..రామలక్ష్మణుల మధ్య చిచ్చు పెట్టిన బాలీవుడ్ హీరో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు బాలీవుడ్ స్టార్స్ కి సైతం దిమ్మతిరిగేలా ఉంది. ఏ ఇండియన్ హీరోకి సాధ్యంకాని విధంగా ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులపై చేసిన మ్యాజిక్ అలాంటిది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు బాలీవుడ్ స్టార్స్ కి సైతం దిమ్మతిరిగేలా ఉంది. ఏ ఇండియన్ హీరోకి సాధ్యంకాని విధంగా ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులపై చేసిన మ్యాజిక్ అలాంటిది. అమరేంద్ర బాహుబలిగా , మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ పెర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
దీనితో Prabhas ఎవరికీ సాధ్యంకాని విధంగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ ఇలా వరుస భారీ చిత్రాలు ప్రభాస్ నుంచి రాబోతున్నాయి. ఇందులో ఆదిపురుష్ చిత్రం ప్రత్యేకమైనది. రామాయణం పౌరాణిక గాధ ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ క్రేజీ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. యువ నటుడు సన్నీ సింగ్ లక్షణుడి పాత్రలో నటించే అవకాశం అందుకున్నాడు.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అక్టోబర్ 6న సన్నీ సింగ్ బర్త్ డే. దీనితో ప్రభాస్ ఒకరోజు ముందుగానే 5వ తేదీనే సన్నీ సింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. సన్నీ సింగ్ కు ప్రభాస్ బర్త్ డే విషెష్ తెలపడంపై యువ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించాడు.
Also Read:ప్రభాస్ 25... సందీప్ రెడ్డి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో 'స్పిరిట్'
ప్రభాస్ పోస్ట్ పై స్పందిస్తూ ' సర్ అతడు మీకు అబద్దం చెప్పాడు. అతడి పుట్టినరోజు రేపు' అని కామెంట్ పెట్టాడు. నీ పుట్టినరోజు రేపు అయితే బాహుబలికి ఎందుకు అబద్దం చెప్పావు అని సన్నీని ప్రశ్నించాడు. దీనికి సన్నీ బదులిస్తూ బాహుబలి ఈరోజే నన్ను బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోమన్నాడు. మధ్యలో నువ్వెందుకు తలదూర్చుతావు అంటూ సన్నీ సింగ్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
మొత్తంగా కార్తీక్ ఆర్యన్.. రామ లక్ష్మణుల మధ్య చిలిపి తగాదా పెట్టేందుకు ప్రయత్నించగా అది బెడిసికొట్టింది. ఇదిలా ఉండగా ఆదిపురుష్ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాధని విజువల్ వండర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.