Asianet News TeluguAsianet News Telugu

కార్తీ ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

తమిళ స్టార్ హీరో కార్తీ తాజాగా నటించిన చిత్రం ‘సర్దార్’ (Sardar). సైలెంట్ గా థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
 

Karthi Sardar Movie Ott release date, When, where?
Author
First Published Nov 11, 2022, 4:29 PM IST

తమిళంతో పాటు బ్యాక్ టు బ్యాక్ తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ అలరిస్తున్న కార్తీకి గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కార్తీ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తుంటున్నారు. తమిళంలో ‘విరుమన్’, ‘పొన్నియిన్ సెల్వన్: 1’లతో హిట్ కొట్టిన కార్తీ రీసెంట్ గా ‘సర్దార్’తోనూ మంచి హిట్ అందుకున్నాడు. దీంతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. 
‘అభిమన్యుడు’ లాంటి సూపర్ సైబర్ థ్రిల్లర్‌ను అందించిన పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్, అక్కినేని నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ ద్వారా విడుదల చేశారు. 

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు హిందీలో అదిరిపోయే స్పందనను దక్కించుకుంది. థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగడంతో.... ప్రస్తుతం ఓటీటీలోనూ వీక్షించేందుకు అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ పొందడంతో ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో Sardar Ott రిలీజ్ డేట్ పై  తాజాగా అప్డేట్ అందింది. నవంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha)లో స్ట్రీమింగ్ కానుంది. 

‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కానీ  ఈనెల 24 నుంచే ఓటీటీ ప్రసారం కానుందని నెట్టింట గట్టి ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేట్రికల్ రన్ ద్వారా ‘సర్దార్’ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఇక ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకోనుంది. ఇదిలా ఉంటే తాజాగా కార్తీ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ‘జపాన్’ టైటిల్ పేరిట డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలనే చిత్రం పూజా కార్యక్రమం కూడా గ్రాండ్ గా నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios