Asianet News TeluguAsianet News Telugu

మందు కిక్కులో మగువల మధ్య... ఇంట్రెస్టింగ్ గా కార్తీ 'జపాన్' ఫస్ట్ లుక్!

కార్తీ లేటెస్ట్ మూవీ జపాన్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు. కార్తీ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న జపాన్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. 
 

karthi latest movie japan first look out now
Author
First Published Nov 14, 2022, 6:07 PM IST


హీరో కార్తీ 25వ చిత్రంగా తెరకెక్కుతుంది జపాన్. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రాజు మురుగన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు. ఒక చేతిలో బంగారు గన్, మరో చేతిలో బంగారు గ్లోబ్ పట్టుకొని ఉన్న కార్తీ ఫోటో గోడకు తగిలించి ఉంది. ఇక సోఫాలో తప్పతాగి పడిపోయి ఉన్న కార్తీని మనం చూడొచ్చు. హెయిర్ స్టైల్ నుండి డ్రెస్సింగ్ వరకు కార్తీ డిఫరెంట్ గా ఉన్నారు.  జపాన్ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. జపాన్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 

అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. జపాన్ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇక విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజు మురుగన్ నిజ జీవితాలకు అద్దం పట్టే కథలు తెరకెక్కిస్తారు. ఆయన దర్శకత్వం వహించిన జోకర్ మూవీ జాతీయ అవార్డు అందుకుంది. 

కాగా కార్తీ లేటెస్ట్ రిలీజ్ సర్ధార్ సూపర్ హిట్ అందుకుంది. దాదాపు వంద కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగులో సైతం సర్దార్ బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ రాబట్టింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన సర్దార్ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్ చేశారు. సర్దార్ లో కార్తీకి జంటగా రాశి ఖన్నా నటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios