మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘ఖైదీ 2’ కోసం ఆడియెన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఈ సందర్భంగా తమిళ హీరో కార్తీనే స్వయంగా అదిరిపోయే అప్డేట్ అందించారు.
తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఖైదీ’ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. 2019 అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు ఆడియెన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుందీ చిత్రం. బాక్సాఫీస్ వద్ద కూడా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దఎత్తున ఆదరించడంతో పార్ట్ 2ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ’ తర్వాత వెంటనే ‘మాస్టర్’,‘విక్రమ్’ చిత్రాలను డైరెక్ట్ చేశారు. అయితే ‘ఖైదీ’తో ‘విక్రమ్’ సినిమాకు ముడిపెడుతూ అద్భుతమైన సినిమాటిక్ యూనివర్స్ చూపించారు. దీంతో ‘ఖైదీ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో ఈ చిత్రం కూడా చేరిపోయింది. ఎప్పుడెప్పుడు చిత్రం ప్రారంభం అవుతుందని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా కార్తీనే సినిమాపై అప్డేట్ అందించారు.
‘సర్దార్’ చిత్ర ప్రమోషన్స్ లో ఉన్న కార్తీ ‘ఖైదీ 2’పైనా క్రేజీ అప్డేట్ అందించారు. వచ్చే ఏడాది చివర్లో మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాతి ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ‘సర్దార్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తీ. ఇదిలా ఉంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేతిలోనూ భారీ చిత్రాలు ఉన్నాయి. థళపతి విజయ్ తో 67, విక్రమ్ 2 ఉన్నాయి. ఈ చిత్రాల తర్వాత ‘ఖైదీ 2’ తీస్తారని తెలుస్తోంది.
