Asianet News TeluguAsianet News Telugu

'దేవ్' టీజర్.. నేటి ట్రెండ్ కి నచ్చే విధంగా..!

తమిళ హీరో కార్తి. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవ్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. 

karthi dev movie teaser talk
Author
Hyderabad, First Published Nov 5, 2018, 1:52 PM IST

తమిళ హీరో కార్తి. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవ్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. 

''ఈలోకంలో బతకడానికి ఎన్నో దారులున్నాయ్‌. ఎవరో చెప్పారని అర్థంకాని చదువు చదివి, ఇష్టంలేని ఉద్యోగం చేసి, ముక్కూ మొహం తెలీని ఓ నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పనిచేసి, ఈగో, ప్రెషర్‌, కాంపిటీషన్‌లో ఇరుక్కుని, అంటీ అంటనట్టు లవ్‌ చేసి, ఏం జరుగుతోందో అర్థంకాకుండా బతకడం ఓ దారి. ఇంకో దారి ఉంది..'' అంటూ కార్తి చెప్పే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది.

ఇప్పటివరకు కార్తి చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా సరికొత్తగా అనిపిస్తుంది. కార్తి లుక్ కూడా ఆకట్టుకుంటోంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో నిక్కీ గల్రాని, ప్రకాష్ రాజ్, జయసుధలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios