కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి తాజాగా ఓ ర్యాలీలో రాకింగ్ స్టార్ యష్ కు ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు. తాము అనేవాళ్లు లేకపోతే అతని సినిమా కెరీర్ లేదని అన్నారు. తనిష్టం వచ్చినట్లు యష్ మాట్లాడితే తర్వాత నిర్మాతలను వెతుక్కోవాల్సివస్తుందన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. అంటే డైరక్ట్ గా నీ సినిమాలకు నిర్మాతలను దొరకనివ్వను..సినిమాలు ఉండవ్ అని చెప్పినట్లైంది అని అక్కడి మీడియా అంటోంది.

ఇంతకీ సీఎంకి  ఓ స్టార్ హీరోకు ఎందుకింత కోపం వచ్చిందంటే... మండ్యలో సుమలతకు మద్దతుగా ప్రచారం చేశాడు యశ్. సుమలత తరఫున నామినేషన్ రోజు నుంచి ఆ హీరో వెంట ఉన్నాడు. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నాడు. ప్రచారం చేసి పెట్టాడు. కుమారస్వామి తన కొడుకు నిఖిల్ మాండ్యా ఎన్నికల్లో గెలవాలని ప్రచారం చేస్తున్నారు. అందుకు వ్యతిరేకంగా ఇలా  యష్ ప్రచారంలోకి వచ్చేసరికి కోపం వచ్చింది. 

దానికి తోడు  యశ్ తన స్పీచ్ లలో భాగంగా కుమారస్వామి   వర్గం వాళ్ల మీద కామెంట్స్ చేసారు. రాజకీయాల్లో ఒకరిమీద మరొకరు విమర్శలు చేసుకోవటం కామనే. అయితే ఈ విషయం కుమార స్వామికి డైజస్ట్ కాలేదు. దీంతో కుమారస్వామికి కోపం వచ్చింది. వెంటనే ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు కుమారస్వామి. సినిమా హీరోలను నమ్మొద్దని.. వారు తెరపై చూపించేదంతా అబద్ధమని, రైతులు ఆత్మహత్యలు అప్పుడు వీళ్లంతా ఏమైపోయారంటూ  కుమారస్వామి ఫైర్ అయ్యారు. 

యశ్ లాంటి వాళ్లు బతుకీడుస్తున్నారంటే అది తన లాంటి వాళ్ల దయే అని కుమారస్వామి అనేసారు. యశ్ మాత్రమే కాదట.. సినిమా వాళ్లంతా తన లాంటి వాళ్ల మీద ఆధారపడే బతుకీడుస్తున్నారని కుమారస్వామి డైరక్ట్ గా అన్నారు. కుమారస్వామి ఓ సినిమా నిర్మాత కావటంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే.. తనలాంటి నిర్మాతలు సినిమాలు తీయడం వల్ల యశ్ లాంటి హీరోలు బతుకీడుస్తున్నారని కుమారస్వామి వాదన. ఇది ఒకింత అసంబద్ధమైన వాదన అని చెప్పవచ్చు.