బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది కరీనా.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకి కరీనా చెప్పిన ఆన్సర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
'మీరు ఎవరితో డేట్ కు వెళ్లాలనుకుంటున్నారు..?' అనే ప్రశ్న కరీనాకి ఎదురుకాగా.. 'రాహుల్ గాంధీ' అని టక్కున బదులిచ్చింది. ఈ ప్రశ్నకి నేను ఈ సమాధానం చెప్పొచ్చో.. లేదో తెలియదు కానీ చెబుతాను అంటూ రాహుల్ పేరు చెప్పింది. అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందని వెల్లడించింది.
మ్యాగజైన్ లో అతడి ఫోటోలు చూస్తున్నప్పుడు అతడితో మాట్లాడితే ఎలా ఉంటుందని అనుకునేదట కరీనా. పూర్తిగా సినిమాలకు అంకితమైన కుటుంబం నుండి వచ్చిన కరీనా.. రాజకీయ కుటుంబానికి చెందిన రాహుల్ తో చర్చ ఆసక్తికరంగా ఉంటుందేమోనని చెప్పింది.
