సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఏ ఫోటో షేర్ చేసినా నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్ గా మారింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ కి అప్పుడపుడు షాకింగ్ లుక్స్ తో దర్శనమిస్తుంటారు. ఫోటో బావుంటే పరవాలేదు గాని ఏ మాత్రం తేడా అనిపించినా ట్రోల్ అవ్వడం పక్కా. 

ఇప్పుడు అదే తరహాలో కరీనా కపూర్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరీనా వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపించడంతో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. 38 ఏళ్ల కరీనా కపూర్ ఆంటీలా మారిందని అంటున్నారు. ఎండలో సెల్ఫీ దిగడంతో కరీనా మొహం ఊహించని విధంగా కనిపించింది. 

కాస్త బక్కచిక్కినట్లు కూడా అనిపించడంతో ఆమెకు తినడానికి ఏమైనా ఇవ్వండి అంటూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో అనేక రకాల ఫోటో షూట్స్ లో పాల్గొని గ్లామర్ గర్ల్ గా మెరిసిన కరీనా ఇప్పుడు ట్రోలింగ్ కి గురవ్వడం ఆమె ఫాలోవర్స్ ని కలవరపెడుతోంది. అయినప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ కరీనాకు మద్దతు పలుకుతున్నారు.