#Boycott_MalabarGold మరియు #No_Bini_No_Business శుక్రవారం ట్రెండ్ అయ్యాయి, ఎందుకంటే దీపావళి మరియు అక్షయ తృతీయ కోసం ఇటీవలి రెండు ప్రకటనలలో  బొట్టుని తొలగించినందుకు ఆభరణాల బ్రాండ్‌ను బ్యాన్ చెయ్యమంటూ ఎమోషన్ ట్వీట్స్ చేస్తున్నారు. 


సోషల్ మీడియా వచ్చాక ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి ముందుకు వెళ్లాల్సిన పరిస్దితి కనపడుతోంది.కరీనా కపూర్ ఖాన్ నటించిన అక్షయ తృతీయ కోసం ప్రముఖ ఆభరణాల గొలుసు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్... సోషల్ మీడియాలో తుఫాను క్రియేట్ చేస్తోంది. ఆ యాడ్ లో బొట్టు లేకుండా కరీనా కపూర్ కనపడటాన్ని "దారుణమైనన నిర్లక్ష్యం" ట్రోల్స్ చేస్తున్నారు.

#Boycott_MalabarGold మరియు #No_Bini_No_Business శుక్రవారం ట్రెండ్ అయ్యాయి, ఎందుకంటే దీపావళి మరియు అక్షయ తృతీయ కోసం ఇటీవలి రెండు ప్రకటనలలో బొట్టుని తొలగించినందుకు ఆభరణాల బ్రాండ్‌ను బ్యాన్ చెయ్యమంటూ ఎమోషన్ ట్వీట్స్ చేస్తున్నారు.

ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “#పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు క్విజ్ నిర్వహించిన అదే మలబార్ గోల్డ్ ఇప్పుడు కరీనా కపూర్ ఖాన్‌తో అక్షయ తృతీయ ప్రచారం కోసం బొట్టు లేకుండా ప్రకటనలను ప్రదర్శిస్తోంది. ఇది ఏమి చూపిస్తుంది? ” అని నిలదీస్తున్నారు.'కరీనా కపూర్ బొట్టు ఎక్కడ? బొట్టు లేకపోతే బిజినెస్ లేదు!' అంటూ సోషల్ మీడియాలో కొందరు తెగేసి చెబుతున్నారు. లేటెస్టుగా కరీనాపై ట్రోలింగ్ ఎందుకు మొదలైందంటే...

 సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్‌లో లేటెస్టుగా ట్రోలింగ్‌కు బలవుతోంది కరీనా కపూర్ ఖాన్ . రీసెంట్‌గా కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్‌పై నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెళ్లి తర్వాత నుదుట సింధూరం పెట్టుకోలేదని ట్రోల్ చేశారు. కరీనాపై వస్తున్న ట్రోల్స్‌కు కారణం కూడా సింధూరమే. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. కరీనా వివాహమై చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు బొట్టు ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నారంటే... దానికి జ్యువెలరీ యాడ్ కారణం. వాణిజ్య ప్రకటనపై వ్యతిరేకత, వేడి కరీనాకూ తగులుతున్నాయి.

మలబార్ గోల్డ్ (Malabar Gold) సంస్థకు కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్. అక్షయ తృతీయ సందర్భంగా ఒక యాడ్ ఇచ్చింది. అందులో కరీనా కపూర్ నుదుట బొట్టు లేదు. ఇది చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. 'బొట్టు లేకపోతే బిజినెస్ లేదు' (#No_Bindi_No_Business), 'బాయ్ కాట్ మలబార్ గోల్డ్ (#Boycott_MalabarGold) అంటూ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. కరీనా నుదుట బొట్టు లేకుండా యాడ్ ఇవ్వడం హిందువులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కొందరు కరీనా కపూర్ మీద కూడా విమర్శలు మొదలుపెట్టారు.