బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అందరినీ కలచివేస్తోంది. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ లో ఉన్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి కారణంగానే సుశాంత్ కి అవకాశాలు లేదని.. ఆ కారణంతోనే మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

గతంలో సుశాంత్ పట్ల తక్కువగా ప్రవర్తించిన వారందరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కరీనా కపూర్.. సుశాంత్ ని కించ పరుస్తూ కామెంట్స్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. దీంతో... ఆ వీడియోని పట్టుకొని కరీనాని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

గతంలో సారా అలీఖాన్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన కరీనా.. సుశాంత్ గురించి వెకిలిగా మాట్లాడింది. `సారాకు నువ్వు ఇచ్చే డేటింగ్ టిప్ ఏంటి?` అని వ్యాఖ్యాత కరీనాను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కరీనా.. `చెత్త మొహంతో ఉండే నీ మొదటి సినిమా హీరోతో మాత్రం డేట్‌కు వెళ్లక`ని సారాతో చెప్పింది. సారా మొదటి సినిమా `కేదార్‌నాథ్`లో సుశాంత్ హీరోగా నటించాడు. 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కరీనాపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. `కరీనా నీకు చాలా పొగరెక్కువ. నీకు ఎలాంటి ప్రతిభా లేదు. కేవలం కపూర్ అనే ఇంటి పేరు వల్ల నువ్వు హీరోయిన్‌గా ఎదిగావు`, `నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది`, `బాయ్‌కాట్ కరీనా కపూర్` అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. 

ఇదిలా ఉండగా.. ఆలియాభట్, సోనమ్ కపూర్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్లకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. మొన్నటి వరకు వీళ్లని ఫాలో అయిన వాళ్లు.. సుశాంత్ మరణం తర్వాత వీరిని అన్ ఫాలో చేస్తున్నారు.

 సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌కు నెటిజన్లు షాకిచ్చారు. ఈమె స్వల్ప కాలంలోనే 4.45 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయిందట. ఇక, స్టార్ వారసులకే అవకాశాలు కల్పిస్తుంటాడనే విమర్శను ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ను 1.88 లక్షల మంది అన్ ఫాలో చేశారట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా 50 వేల మంది ఫాలోవర్లను కోల్పోయాడట.