వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరాటే కళ్యాణి.  వివాదాస్పద  వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రీసెంట్ గా ఆమో చేసిన వ్యాక్యలకు మా సోసియేషన్ నుంచి వార్నింగ్ వచ్చినట్టు తెలుస్తోంది.  

కరాటే కళ్యాణి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది కళ్యాణి. మా అసోసియేషన్ మెంబర్ ఉన్న కళ్యాణి... రీసెంట్ గా మరిన్ని వివదాదాలకు కారణం అవుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యాలు వివాదాలుగా నిలుస్తున్నాయి. మొన్నటికి మొన్న తిరుపతికి వెళ్లి.. అక్కడ కూడా గందరగోళం సృష్టించిన ఈ నటి.. తాజాగా మరోసారి మీడియాకెక్కి మరో వివాదం రేపింది. ఈసారి ఏకంగా పెద్ద ఎన్టీఆర్ పైనే తీవ్రమైన వాఖ్యలు చేసింది కళ్యాణి. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. ఖమ్మంలో ఏర్పాటు చేయబోతున్న నందమూరి తారకరాముడి విగ్రహంపై కళ్యాణి వివాదాస్పద వాఖ్యలు చేసింది.

ఈ నెల 28న మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధ్య దైవం అయిన ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్‌పై 54 అడుగుల పొడవైన శ్రీ కృష్ణ అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్డడంపై కరాటే కళ్యాణి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూఉద్యమాన్ని తీసుకువచకచింది. 

ఈ విషయంలో యాదవ సంఘలతో కలిసి.. పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యాక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా వీరితో కలిసి తమ వాయిస్ వినిపించింది సినీ నటి .. బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి. విగ్రహం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఖమ్మలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎన్టీఆర్‌ విగ్రహం ఇలా కృష్టుడి ఆకారంలో లేదు.. దాంతో ఇక్కడ అలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇక ఇప్పుడు ఈ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. పెద్దాయిన ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయడంపై తమకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కరాటే కళ్యాణి. మహానుభావుడి విగ్రహం పెట్టడం అందరికి ఇష్టమే అన్నారు. కాని తారకరాముని విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయడంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

అయితే కరాటే కళ్యాణికి వాఖ్యలపై మా అసోసియేషన్ స్పందించినట్టు తెలుస్తోంది. మా అసోసియేషన్ నుంచి ఆమెకు బెదిరింపు కాల్ వచ్చిందని తెలుస్తోంది. స్వయంగా మంచు విష్ణు కాల్ చేసినట్లు సమాచారం. ఆ కాల్‌లో మీ స్టాండ్ మార్చుకోవాలని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కరాటే కళ్యాణి స్పందించింది. అయితే మా నుంచి ఫోన్ వచ్చిన మాట వాస్తవం అని.. అయితే ఈ విషయంలో తన స్టాండ్ మార్చుకోమని మాత్రంమే వారు అడిగారని.. లేకుంటే తనపైక్రమశిక్షణ చర్యలు ఉంటాయిన వారు వివరించినట్టు తెలుస్తోంది. 

సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్‌ ఓ దేవుడులాంటి వ్య‌క్తి. ఆయ‌న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఇలా అడ్డుపడటం.. వివాదాస్పద మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదని వారు అన్నట్టు కళ్యాణి తెలిపారు. ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తే నాకేం స‌మ‌స్య లేదు. కానీ శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నాన‌ని చెప్పాను. నా స్టాండ్ వారు అర్థం చేసుకున్న‌ప్ప‌టికీ మా రూల్స్ ప్ర‌కారం క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చ‌ర్య‌లు ఉంటాయని చెప్పారు. అందులో బాలకృష్ణ, మురళీ మోహన్, జయసుధ, జయప్రద వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. క్రమశిక్షణా కమిటీతో మాట్లాడి యాక్షన్ తీసుకోబోతున్నాం. షోకాజ్ నోటీసులు వ‌స్తాయి. అవి తీసుకున్నాక వివరణ ఇవ్వండి. మేం దాన్నిపరిశీలిస్తాం అని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తాను స్టాండ్ మార్చుకోనన్నారు కళ్యాణి.