త‌న లైఫ్ లో ల‌వ్ లేదు అంటున్న క‌ర‌ణ్ జోహ‌ర్. ముగ్గురిని ప్రేమించిన ఒక్క‌రు కూడా అంగీక‌రించ‌లేద‌ట‌. 44 ఏళ్ల జీవితంలో ఒంటరితనమే ఎక్కువ అంటున్న క‌ర‌ణ్ జోహ‌ర్.
కరణ్ తన జీవితంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని ప్రేమించారు. కానీ వారెవరూ కరణ్ ప్రేమని అంగీకరించలేదు. ‘నా సినిమా లైఫ్ వంద శాతం సక్సెస్ అయింది కానీ నా లవ్ లైఫ్ మాత్రం వంద శాతం ఫ్లాప్. నన్ను తిరిగి ప్రేమించనివారిని నేను ప్రేమించాను. అందుకే నేను జీవితంలో పెళ్లి గురించి ఆలోచించడంలేదేమో. జీవితంలో అన్నీ అనుభవించాను కానీ ప్రేమలో ఉన్న అనుభూతిని మాత్రం రుచిచూడలేకపోయాను.
అందరూ నువ్వున్న స్థానంలో నిన్ను ఏ అమ్మాయికాదనదు అంటుంటారు. ఏ స్థానం గురించి వారు మాట్లాడుతున్నారో నాకుఇప్పటికీ అర్థం కావడంలేదు. ఒకమ్మాయిని చూసి ఇష్టపడిన ప్రతీసారి నాకు చేదు అనుభవమే ఎదురైంది. నా 44 ఏళ్ల జీవితంలో ఒంటరితనమే ఎక్కువగా ఉంది’ అంటూ తన సింగిల్ లైఫ్ గురించి వివరించారు కరణ్.
