తన కుమార్తె తొలి చిత్రాన్ని కళ్లారా చూడకుండానే శ్రీదేవి మరణించింది. ఇన్నిరోజులు తల్లి ఉందన్న ధైర్యంతో ఉండేది జాన్వీ. తొలి చిత్రంలో నటిస్తున్న ఎవరికైనా కాస్త ఆందోళన ఉంటుంది. సరిగా నటించగలనా లేదా అనే వత్తిడిలో ఉంటారు. జాన్వీ నటిస్తున్న తొలి చిత్రం దఢక్. తన కుమార్తెని వెండి తెరపై చూడాలని ముచ్చట పడింది శ్రీదేవి. కానీ ఆ కోరిక తీరకుండానే మరణించింది. తల్లిచాటు బిడ్డగా ఉన్న జాన్వీకి ఇక నటన పరంగా సలహాలు ఇచ్చే వారు ఉండకపోవచ్చు

కానీ జాన్వీ బాధ్యతని నిర్మాత కరణ్ జోహార్ తీసుకున్నారు. త్వరలో దఢక్ చిత్ర తదుపరి షెడ్యూల్ పార్రంభం కానుంది. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ తన టీంకు సూచనలు చేశారట. కొద్ది రోజుల పాటు సెట్స్ లో జాన్వీపై ఎక్కువ వత్తిడి పెట్టవద్దని సూచించినట్లు తెలుస్తోంది. జాన్వీ పట్ల అంతా స్మూత్ గా వ్యవహరించాలని ఆదేశించాడట. దఢక్ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తల్లి మరణించిన దుఃఖంలో ఉన్న జాన్వీ కనీసం షూటింగ్ కు హాజరయ్యే పొజిషన్ లో కూడా లేదు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అర్థం చేసుకుని ఆమె మెలగాలని కరణ్ జోహార్ ఆదేశించారు.