బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయి పెరిగింది. అప్పటివరకు దక్షిణాది సినిమాలను తక్కువ చేసి చూసేవారికి బాహుబలి గట్టి సమాధానంగా నిలిచింది. ఈ సినిమా తరువాత తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం, వాటిని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది.

కొన్ని సినిమాల డిజిటల్, డబ్బింగ్ రైట్స్ బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ లో వచ్చే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు బాలీవుడ్ లో క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో సౌత్ సినిమాల డిమాండ్ గురించి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

శంకర్ రూపొందించిన '2.0' సినిమాను హిందీలో కరణ్ జోహార్ తన బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సౌత్ సినిమాల గొప్పతనాన్ని వెల్లడించారు. 'సౌత్ దర్శకుల విజన్ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ల టేకింగ్, టెక్నాలజీని వారు వినియోగించుకునే విధానం అధ్బుతం. సౌత్ సినిమాల కారణంగానే భారతీయ సినిమా పరిశ్రమకి మంచు గుర్తింపు వస్తోంది.

బాలీవుడ్ దర్శకులు ప్రయోగాలు, సాహసాలు చేయడానికి ముందుకు రావడం లేదు. మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం లేదు. వాళ్లు భారీ చిత్రాలతో మనల్ని మనం తక్కువగా భావించేలా చేస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలి లాంటి వారు భారీ సినిమాలు చేస్తున్నా.. బాలీవుడ్ లో అలాంటి సినిమాలు మరిన్ని రావాలి' అని వెల్లడించారు.