Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండను వదలనంటున్న కరణ్ జోహార్, లైగర్ కాంబినేషన్ రిపీట్...?

విజయ్ దేవరకొండను వదిలేది లేదంటున్నాడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్. విజయ్ దేవరకొండతో మరోసినిమాను ప్లాన్ చేస్తున్నాడట. 
 

Karan Johar Movie With Vijay Devarakonda Once again
Author
First Published Oct 13, 2023, 1:28 PM IST

లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ నుఫేస్ చేశాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ సినిమాగా స్టార్ట్ అయిన లైగర్ ను.. తాను ప్రొడ్యూసర్ గా ఎంటర్ అయ్యి.. పాన్ఇండియా అంటూ.. హడావిడిచేశారు. బడ్జెట్ పెంచి.. సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు. కాని ఈసినిమా బాక్సాఫీస్  దగ్గర భారీగా బోల్తా కొట్టింది. అయితే ఈ దెబ్బతో బాలీవుడ్ ఆశలకు పుల్ స్టాప్ పెట్టి టాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు విజయ్. ఈక్రమంలో విజయ్ తో మరో సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్  లో సెన్సేషనల్ స్టార్ రౌడీ హీరోగా పేరు సాధించాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా సమంతతో కలిసి ఖుషి మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు విజయ్. ఈసినిమా  మంచి సక్సెస్ ని అందుకోవడంతో.. లైగర్ ప్లాప్ నుంచి కొంతలో కొంత బయటపడ్డాడు. ఈసినిమా తరువాత కూడా విజయ్ రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. అవి కూడా భారీ స్తాయిలో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. ఇక . ఇక ఈ లైనప్ లో అయితే బాలీవుడ్ దర్శకుడు నిర్మాత అయిన కరణ్ జోహార్ తో మరోసారి వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా రానున్నట్టుగా టాక్ మొదలైంది. అయితే ఇక్కడ ఇంకో విషేశం ఏంటంటే.. ఈసినిమాను కూడా సౌత్ డైరెక్టర్.. అది కూడా టాలీవుడ్ డైరెక్టర్ తోనే  డైరెక్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట  కరణ్. ప్రస్తుతం సౌత్ లో.. టాలీవుడ్ తో పాటు.. తమిళంలో కూడా యంగ్ డైరెక్టర్లు తమ హవా చూపిస్తున్నారు. దాంతో ఓ స్టార్ డైరెక్టర్ ను ఎంచుకుని.. ఎంత ఖర్చు పెట్టి అయినా.. ఈసినిమా చేయాలని ఆయన అనుకున్నారట. ఇక ఈ మూవీనిజమైనతా.. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios