బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ ఏ పని చేసిన దానికో ప్రత్యేకత అండ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. బాహుబలి నార్త్ లో హిట్టవ్వడానికి ప్రధాన కారణం ఆయన రిలీజ్ చేసిన విధానం.  సినిమాకు ప్రమోషన్స్ ద్వారా భారీ క్రేజ్ ను రప్పించి భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఆ సినిమాలతో జక్కన్న టాలెంట్ ఏమిటో కరణ్ జోహార్ కి పూర్తిగా అర్ధమయ్యింది. 

రీసెంట్ గా 2.0 ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ రాజమౌళి గురించి మాట్లాడారు. బాహుబలి మా అందరిలో ఒక కొత్త తరహా ఆలోచనను కలిగించిందని చెప్పారు. అదే విధంగా రాజమౌళి ఒక జీనియస్ అంటూ.. బాహుబలిలో ఎన్నో ఎమోషన్స్ సీన్స్ ను ఆకర్షించే విధంగా తెరకెక్కించారని అన్నారు. 

ఇక రాజమౌళి టాలెంట్ ఏంటో ఆలస్యంగా తెలిసిందని చెబుతూ.. ముందే తెలిసి ఉంటె ఈగ సినిమాను కూడా బాలీవుడ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేవాళ్లమని తెలియజేశారు. ఈగ సినిమా కూడా తనకు ఎంతో బాగా నచ్చిందని చెప్పిన కరణ్ జోహార్ బాహుబలి స్థాయిలో ప్రమోట్ చేసి ఉంటే ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది అని వివరణ ఇచ్చారు.