స్టార్ క్రికెటర్స్ సచిన్ - ధోని - అజారుద్దీన్.. బయోపిక్స్ అనంతరం ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అత్యంత స్టార్ స్టామినాతో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ '83' కోసం దర్శకుడు కబీర్ ఖాన్ ఎంతగానో కష్టపడుతున్నాడు. 

1983లో భారతదేశానికి తొలి వరల్డ్ కప్ ను అందించిన నాయకుడి పాత్రలో రణ్ వీర్ నటిస్తున్నాడు. అయితే తుది దశకు చేరుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూకే కంట్రీస్ లో జరుగుతోంది. ఇక 1983లో భారత్ - వెస్ట్ ఇండీస్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో జరిగింది. 

2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా మళ్ళీ అక్కడే జరగబోతోంది. మ్యాచ్ అయిపోగానే 83 షూటింగ్ క్లయిమాక్స్ సీన్ ను దర్శకుడు అక్కడే ప్లాన్ చేశాడు. అప్పటి వాతావరణం తెరపై కళ్లకు కట్టినట్లు కనిపించాలని ఈ షెడ్యూల్ ని ఛాలెంజిగ్ గా తీసుకున్నారు. 

లార్డ్స్ గ్రౌండ్ లో భారత జట్టు ఏ విధంగా ప్లాన్ వేసుకుంది కపిల్ ఏ విధంగా అడుగులు వేశాడు అనే విషయాల్ని కబీర్ ఎమోషనల్ గా చూపించనున్నాడట. బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు ఏ మాత్రం రాజీపడటం లేదు. ఇక సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ఫిక్సయ్యింది.