Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ వేదికపై కాంతారకి అరుదైన గౌరవం.. ఏకంగా ఐక్యరాజ్య సమితిలో స్క్రీనింగ్

ఐక్యరాజ్య సమితి వేదికగా కాంతార చిత్రానికి ఈ అరుదైన గౌరవం లభించనుంది. స్విట్జర్లాండ్ లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కాంతార స్క్రీనింగ్ జరగనుంది. 

Kantara movie to be screened in UN
Author
First Published Mar 17, 2023, 11:10 AM IST

గత ఏడాది పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాటు కాంతారా కూడా ఉంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ కాంతార తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు. ప్రతిభింభించేలా 

కర్ణాటకలోని తుళు సంస్కృతిని ప్రతిబింబించేలా హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పుడు కాంతార చిత్రానికి, రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కుతున్నాయి.  ఏకంగా ఐక్యరాజ్య సమితిలో కాంతార చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. మార్చి 17న అంటే నేడు ఐక్యరాజ్య సమితి వేదికగా కాంతార చిత్రానికి ఈ అరుదైన గౌరవం లభించనుంది. స్విట్జర్లాండ్ లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కాంతార స్క్రీనింగ్ జరగనుంది. 

 

అనంతరం రిషబ్ శెట్టి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్నారు. అలాగే డిన్నర్ మీటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. ఈ కార్యక్రమంలో రిషబ్ శెట్టి భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఎలా భాగం, ప్రకృతి, కాలుష్యనివారణ, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 17న దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా కాంతార స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. 

ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. కాంతార చిత్రంలో రిషబ్ శెట్టి అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతడి నటన అబ్బురపరిచే విధంగా ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios