దయచేసి చెపుతున్నా.. కాంతార రీల్స్ చేయకండీ.. దేవుడిని అనుకరించకండీ.. మా మనోభావాలు దెబ్బతీయకండీ అంటూ వేడుకున్నారు కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందించిన కన్నడ హీరో.. ఏమన్నారంటే..? 


సైలెంట్ గా వచ్చి..ప్రభంజనం సృష్టించింది కన్నడ సినిమా కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను కెజియఫ్ నిర్మాతలు తెరకెక్కించారు. కన్నడ లో తుళు ట్రెడిషన్ కు సబంధించిన ఓ తెగకు సంబంధించిన సాంప్రదాయాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. 

కాంతార సినిమాలో సంప్ర‌దాయ దుస్తులు వేసుకున్న‌ గెటప్ హైలెట్ అని చెప్పాలి. పంజుర్లి దేవుడు ఆవ‌హించిన‌ సీన్స్ ప్రతీ ప్రేక్షకుడికి గూజ్ బాంబ్స్ తెప్పించేలా ఉన్నాయి. అయితే చిన్న చిన్న విషయాలు కూడా రీల్స్ రూపంలో వైరల్ చేసే నెటిజన్లు.. ఇంతలా హిట్ అయిన సినిమాను రీల్స్ చేయకుండా ఉంటారా చెప్పండి. కొంద‌రు ఈమ‌ధ్య సోష‌ల్‌మీడియాలో కాంతార సీన్స్‌ను రీల్స్ చేయ‌డం స్టార్ట్ చేశారు. ఇది గ‌మ‌నించిన రిష‌బ్‌ శెట్టి వీడియో స్టేట్‌మెంట్ ద్వారా అంద‌రికీ ఒక రిక్వెస్ట్‌ చేశాడు.

ట్విట్టర్ లో ఓ వీడియోనుపోస్ట్ చేసిన రిషబ్ .. ఇలా అన్నాడు. ఈ సినిమాలోని దేవుడి పాత్ర‌ను అనుక‌రించ‌కండి. అలాంటి ప‌నులు చేస్తే మా మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి అని రిష‌బ్‌ శెట్టి అన్నాడు. ఈ సినిమాను నిర్మించిన హొంబ‌లే సంస్థ కూడా రిష‌బ్‌ శెట్టి మాట్లాడుతున్న‌ వీడియోను శుక్ర‌వారం రిలీజ్ చేసింది. ఇది ఓ తెగ ఆచారానికి సబంధించినది. అది ఎలా పడితే అలా చేయడం మంచిది కాదు. ఆ తెగవారు మాత్రంమే ఈ ఆచారాన్ని పాటిస్తారు. అందుకే ఇలా చేయవద్దు అని రిషబ్ వేడుకున్నారు. 

Scroll to load tweet…

తెలుగులో ఈ సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. కన్నడలో ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. తెలుగులో కూడా అంతే రెస్పాన్స్ ను సాధించింది ఈ సినిమా. ఇక కాంతార సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు క‌న్న‌డ‌ హీరో రిష‌బ్‌ శెట్టి. ఈ సినిమాలో అత‌ని న‌ట‌న‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. రజనీ కాంత్ ఇంటికి పిలిచి మరీ అభినందించి.. గోల్డ్ చైన్ భహుమతిగా అందించాడు. అంతేకాదు ఈ మూవీకి ద‌ర్శ‌కుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు రిషబ్.