userpic
user icon
0 Min read

రిషబ్ శెట్టి కాంతార 1 రిలీజ్ వాయిదా పడిందా? మూవీ టీమ్ ఏమంటున్నారంటే?

Kantara Chapter 1 Release Date Confirmed No Delay Says Team in telugu jms
రిషబ్ శెట్టి కాంతారా ఫిల్మ్ 2 రిలీజ్ ఎనౌన్స్‌మెంట్స్ వచ్చేశాయ్!

Synopsis

రిషబ్ శెట్టి కాంతారా 1 సినిమా కోసం అభిమానులు  ఎదురుచూస్తున్నారు. మళ్ళీ పాన్ ఇండియా వ్యాప్తంగా సందడి చేయడానికి  కాంతారా 1 సినిమా రెడీ అవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రిలీజ్ వాయిదా పడుతోందని టాక్ నడుస్తోంది. దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

కేజీఎఫ్, కాంతారా సినిమా తర్వాత కన్నడ సినిమాలపైన అంచనాలు పెరిగిపోయాయి. సౌత్ సినిమాలకు డిమాండ్ కూడా డబుల్ అయింది. యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ రిలీజ్‌కు ఇంకా ఏడాది వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి డైరెక్షన్, యాక్టింగ్ చేస్తున్న కాంతారా 1 సినిమా అయినా త్వరగా వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటుండగా.. ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడిందని అన్నారు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో కాంతారా మూవీ టీమ్ ఈ విషయంలో ఒక అప్‌డేట్ ఇచ్చింది.

కాంతార టీమ్ క్లారిటీ
కాంతారా 1 సినిమా లేట్ అవుతోందని పోస్టులు వైరల్ అవుతుండటంతో కాంతారా టీమ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. కాంతారా ముందు అనుకున్నట్టుగానే అక్టోబర్ 2న రిలీజ్ అవుతుందని తెలిపింది. దీనికోసం ఒక  వీడియోను టీమ్ పోస్ట్ చేసింది. కాంతారా 1 సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందా? అని వాట్సాప్ చాట్ మెసేజ్‌తో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. తర్వాత కన్నడ, హిందీ, తెలుగుతో సహా చాలా భాషల్లో డౌటే లేదు, రిలీజ్ లేట్ అవ్వదు అని రాసిన టెక్ట్స్ తో పాటు..  చివర్లో కాంతారా రిలీజ్ డేట్ కన్ఫామ్ చేస్తూ పోస్టర్ వేశారు. 

Also Read: ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

దీంతో కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్‌లో ఎలాంటి ఆలస్యం లేదని కాంతారా మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది.  దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంకొన్ని నెలల్లోనే కాంతారా 1 సినిమా రిలీజ్ కానుంది. ఈ విషయం బయటకు రాగానే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. చాలామంది మరోసారి కాంతారా పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. కాంతారా 1 సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kantara (@kantarafilm)

 

ఒక్క సీన్‌కు 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు
కాంతారా సినిమా తక్కువ బడ్జెట్‌లో తీసి ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కానీ కాంతారా 1 చాప్టర్ భారీ  బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.  అందుకే ప్రతి సీన్‌ను చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. కాంతారా 1 మూవీలో 500 మంది ఫైటర్లు, 3000 మంది ఆర్టిస్టులతో భారీ  యాక్షన్ సీన్ ఒకటి చేసినట్టు తెలుస్తోంది. ఈసీన్ సినిమా మొత్తానికి హైలెట్ అవ్వబోతున్నట్టు చెపుతున్నారు. ఈ ఫైటింగ్ సీన్‌ను రీసెంట్‌గా షూట్ చేశారు. 

Also Read: బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?

రిషబ్ శెట్టి 3 నెలల ట్రైనింగ్
రిషబ్ శెట్టి ఈసినిమా కోసం చాలా కష్టపడ్డారు.  కాంతారా 1 సినిమా కోసం ఫైటింగ్ సీన్, కొన్ని సీన్స్ కోసం 3 నెలలు కలరి ఫైట్, గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రాక్టీస్ చేశాడు. ఈ మూవీలోని ఫైటింగ్ సీన్‌ను 40 నుంచి 45 రోజులు షూట్ చేశారు. 

కాంతారా 1 బడ్జెట్
కాంతారా సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాను దాదాపు 16 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్ తో  నిర్మించారు. కానీ కాంతారా 1 చాప్టర్ సినిమాను ఏకంగా 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా అంతా రిలీజ్ అవ్వబోతున్న ఈమూవీ 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నారు టీమ్.  

Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

పాన్ ఇండియా సినిమా
కాంతారా సినిమా కన్నడలో రిలీజ్ అయ్యాక పాన్ ఇండియా సినిమా అయింది. కానీ కాంతారా చాప్టర్ 1 సినిమా మాత్రం తెరకెక్కడమే పాన్ ఇండియా సినిమా గా నిర్మించబడుతుంది. కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం, హిందీతో సహా చాలా మరికొన్ని  భాషల్లో రిలీజ్ కాబోతోంది.  రిషబ్ శెట్టి ఈ సారి ఏమాయ చేస్తాడా.. అని  సినిమా కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది.

 


 

Latest Videos