Asianet News TeluguAsianet News Telugu

Kantara- Chapter1: `కాంతారః ఛాప్టర్‌ 1` ఫస్ట్ లుక్‌.. ఒళ్లుగగుర్పొడిచేలా గ్లింప్స్.. లెజెండ్‌ ముందే పుడితే?

`కాంతార` మూవీ కన్నడలోనే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌ రాబోతుంది. `కాంతార 2`ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్‌ విడుదలైంది.

kantara chapter 1 first look gimpse released
Author
First Published Nov 27, 2023, 12:56 PM IST

`కాంతార` మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. దర్శక నటుడు రిషబ్‌ శెట్టి రూపొందించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట కన్నడలోనే హిట్ అయిన ఈ మూవీ ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్‌ అయి విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. భారీగా కలెక్షన్లని సాధించింది. ఓ ట్రెండ్‌ సెట్టర్‌లా నిలిచింది. దీనికి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శక, నటుడు రిషబ్‌ శెట్టి ప్రీక్వెల్‌ ప్లాన్‌ చేశారు. 

తాజాగా `కాంతారః ఛాప్టర్‌1` పేరుతో `కాంతార2` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈమూవీ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో కదంబుల పాలనలో పునాణగాథ పుట్టిందనే కాన్సెప్ట్ తో ఈ గ్లింప్స్ ని విడుదల చేశారు. `కాంతార`లో రిషబ్‌ శెట్టి పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లాడు. అక్కడ దేవుడు నిలిచే స్థలంలో ఆగిపోయాడు. అతని చుట్టూ మంటలు ఉన్నాయి, ఆకాశం వైపు చూడగా, ఓ భీకరమైన శబ్దంతో రిషబ్‌ శెట్టి ఓ భయంకరమైన యోధుడిలా మారిపోయారు. కండలు తిరిగిన దేహంతో, ఒంటి నిండా రక్తం కారుతూ కనిపించాడు. ఆయన లుక్‌, వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. `కాంతార` ని మించి ఈ `కాంతార2` ఉంటుందని అర్థమవుతుంది. 

హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుంది. ఈసారి భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏడు భాషల్లో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇతర రెండు నార్త్ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీకి కూడా అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తుండటం విశేషం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios