#KannurSquad:ఓటిటిలోనూ పెద్ద హిట్టే,ఏముంది అందులో
ఈ సినిమా, రీసెంట్ గా హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చి అక్కడా సూపర్ హిట్ గా నిలిచే వ్యూస్ తో ముందుకుపోతోంది. ఆ విషయం మనకు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో జనం డిస్కషన్స్, పోస్ట్ లను బట్టి అర్దమవుతోంది.

కేవలం హీరోని చూసి మాత్రమే జనాలు సినిమాలు చూడటం లేదు. కంటెంట్ జెన్యూన్ గా సినిమాలు చూస్తున్నారు. అందుకే మళయాళ సినిమాలు ఓటిటిలో రిలీజైనా మనవాళ్లకు తెగ నచ్చుతున్నాయి. ఇక సీనియర్ హీరో ముమ్మట్టి తన 72 ఏళ్ల వయస్సులో చేసిన తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్' థియేటర్ లోనే కాకుండా ఓటిటిలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మాస్ మసాలా సినిమాలు చేసే మమ్ముట్టి తన పంథా మార్చుకుని చేస్తున్న సినిమాలు బాగుంటున్నాయి. ఆ సినిమాల్లో ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. హీరోయిన్స్ ఉండరు, కేవల కథకు ప్రాముఖ్యం ఇస్తూ కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. అంతెందుకు తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్'లో ముమ్మట్టికి ఓ కుటుంబం ఉన్నట్లు ఎక్కడా చూపించలేదు. కేవలం ఓ సిన్సియర్ పోలీస్ అధికారి క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా మమ్ముట్టి నటించారు. నటనతో మెప్పించారు.
మమ్ముట్టి హీరోగా నటించిన కన్నూర్ స్క్వాడ్ ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా, రీసెంట్ గా హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చి అక్కడా సూపర్ హిట్ గా నిలిచే వ్యూస్ తో ముందుకుపోతోంది. ఆ విషయం మనకు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో జనం డిస్కషన్స్, పోస్ట్ లను బట్టి అర్దమవుతోంది.
చిత్రం కథలో ... కేరళ లో 'కన్నూర్' జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడానికిగాను గతంలో అక్కడ పనిచేసిన ఒక ఎస్పీ, 'కన్నూర్ స్క్వాడ్' పేరుతో నలుగురు సభ్యులు గల టీమ్ తో ఒక స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తాడు. ఆ స్క్వాడ్ ని జార్జ్ (మమ్ముట్టి) లీడ్ చేస్తూంటాడు. 2017లో 'కాసర్ గడ్'లోని ఒక రాజకీయనాయకుడు అబ్దుల్ వాహెబ్ హత్య జరుగుతుంది. ఆయన కూతురు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఉంటుంది. ఈ కేసును 10 రోజుల్లోగా ఛేదించి హంతకులను పట్టుకోవాలని, అక్కడి ఎస్పీ చోళన్ (కన్నడ కిశోర్)పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఆయన ఈ కేసును 'కన్నూర్ స్క్వాడ్'కి అప్పగిస్తాడు. అక్కడ నుంచి ఆ టీమ్ ఎలా కష్టపడి నార్త్ ఇండియా అంతటా తిరిగి ఆ హంతకులను ఎలా పట్టుకున్నారనేది కథే. ఈ క్రమంలో రకరకాల అడ్డంకులు వస్తాయి. వాటిని టీమ్ ఎలా అధిగమించిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
అలాగే నార్త్ ఇండియాలోని గ్రామంలో జరిగే సీన్స్ లో మమ్ముట్టి హీరోయిజం ఎలివేట్ చేశారు. ఆ ఎపిసోడ్ మొత్తం బావుంటుంది. సినిమాలో విజువల్స్, యాక్టర్స్ పర్ఫామెన్స్ లతో పాటూ యాక్షన్ సీన్స్ కూడా చాలా నాచురల్ గా డిజైన్ చేయటమే నచ్చుతోంది. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా మహ్మద్ షఫీ ఈ కథను సినిమాకి తగినట్టుగా రాశాడు.