కన్నప్ప మైథలాజికల్ మూవీ కాదన్న మంచు విష్ణు... ఇదేం ట్విస్ట్?

మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది కన్నప్ప. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కన్నప్ప మైథలాజికల్ మూవీ కాదు అంటున్నాడు మంచు విష్ణు. 
 

kannappa not a mythological movie says manchu vishnu ksr

కన్నప్ప తో మంచు విష్ణు పెద్ద సాహసమే చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో కన్నప్ప తెరకెక్కిస్తున్నాడు. మంచు విష్ణుకు కనీస మార్కెట్ లేదు. ఆయన గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కోటి రూపాయల షేర్ రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో ఆయన పాన్ ఇండియా మూవీ చేయడం కత్తిమీద సామే. అందుకే మంచు విష్ణు తెలివిగా ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ ని ప్రాజెక్ట్ లో భాగం చేశాడు. 

ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న ప్రభాస్, మోహన్ లాల్ నటించడం కన్నప్ప చిత్రానికి మంచి ప్రచారం తెచ్చిపెడుతుంది. వారి కోసమైనా జనాలు థియేటర్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. మూవీలో విషయం ఉంటే తర్వాత ఆటోమేటిక్ గా ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడతారు. 

కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లో జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. కన్నప్ప గా నటిస్తున్న మంచు విష్ణు ఈ చిత్ర షూటింగ్ లో గాయపడ్డారు. ఇదిలా ఉంటే... కన్నప్ప మైథలాజికల్ మూవీ కాదంటున్నాడు మంచు విష్ణు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. ఈ క్రమంలో మైథలాజికల్ మూవీ కన్నప్ప రిలీజ్ ఎప్పుడు? అని ఓ నెటిజన్ అడిగాడు. 

ఈ ప్రశ్న మంచు విష్ణును బాధించింది అట. మైథాలజీ అంటే కల్పిక కథ అని అర్థం. కన్నప్ప కల్పిత కథ కాదు. వాస్తవంగా జరిగింది. కాబట్టి కన్నప్ప ను మైథలాజికల్ మూవీ అనకూడదని మంచు విష్ణు వివరణ ఇస్తున్నారు. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios