దళితులపై నోరు జారి.. ఇబ్బందులు కొని తెచ్చుకున్న ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర.. తాజాగా హైకోర్ట్ ను ఆశ్రయించారు. ఇంతకీ కోర్ట్ లో ఏమని పిటీషన్ వేశారంటే..?
ప్రస్తుతం కన్న నాట స్టార్ సీనియర్ నుటుడు ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదోళనలు జరుగుతున్నాయి. అంతే కాదు. ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఈక్రమంలో ఉపేంద్రను అరెస్ట్ చేయవద్దు అని కోర్ట్ నుంచి తీర్పు వచ్చినా... ఆయన చేసిన వ్యాఖ్యలకు స్వయంగా క్షమాపణలు కోరినా కూడా దళితులు వదిలిపెట్టడం లేదు. ఆదోళనలతో పాటు.. ఉపేంద్రపై చర్యలకు వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇంకా కేసులు నమోదు అవుతున్న క్రమంలో.. అరెస్టు భయంతో పాటు దాడులు జరుగుతాయి అన్న అనుమానంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఉపేంద్ర. కన్నడనాట హీరోగా, దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఉపేంద్ర..ఇటు తెలుగులో కూడా హీరోగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ ను చూశారు. ఇక తాజాగా ఆయన ఈ విషయంలో అజ్ఞాతం వీడి.. కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసి అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం ఈ విషయం కన్నడ నాట ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇక కర్నాటకలో ప్రజాకీయ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు ఉపేంద్ర. ఈ పార్టీ స్థాపించి ఆరేళ్లు అయిన సందర్భంగా... రీసెంట్ గా ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో ఆయన మాట్లాడారు. ఊరన్న తర్వాత మంచి, చెడు కూడా ఉంటాయని, మంచికే పెద్దపీట వేసి చెడును తొలగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ కన్నడ సామెతను ఉటంకించారు. ఇది దళితులను కించపరిచే విధంగా ఉండటంతో భారీ వివాదానికి కారణమైంది.
ఉపేంద్ర చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చాలా మంది కోపంగా ఉన్నారు. దీంతో ఉపేంద్ర మళ్లీ ఫేస్‌బుక్‌లోకి వచ్చి తన ప్రకటనకు క్షమాపణలు చెప్పారు. "అనుకోకుండా" ఆ వ్యాఖ్యలను చేశానని చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లైవ్‌లో, నేను అనుకోకుండా తప్పు ప్రకటన చేసాను. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలుసుకున్న వెంటనే, నా సోషల్ మీడియా నుండి ఆ వీడియోను తొలగించాను. నా ప్రకటనకు క్షమాపణలు కోరుతున్నాను'' అని రాశారు.
మరోవైపు, బెంగళూరు, రామనగర జిల్లాల్లోని దళిత సంఘాలు ఉపేంద్రకు వ్యతిరేకంగా నిన్న కూడా ఆందోళనలు కొనసాగించారు. ఆందోళనల నేపథ్యంలో సదాశివనగర, కత్రిగుపెట్టలో ఉపేంద్ర నివాసాలకు పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు, ఉపేంద్రపై ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని సామాజిక కార్యకర్త నవీన్‌గౌడ చలనచిత్ర వాణిజ్య మండలిని డిమాండ్ చేశారు. ఉపేంద్ర పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.
