కన్నడ, తమిళం, తెలుగు, హిందీ ఇలా అనేక మంది సినీ ప్రముఖులు చనిపోయారు. తాజాగా కరోనా మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది.  తాజాగా కన్నడ నటుడు కన్నుమూశారు.

కరోనాతో వరుసగా సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ ఇలా అనేక మంది సినీ ప్రముఖులు చనిపోయారు. తాజాగా కరోనా మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. కన్నడ సీనియర్‌ నటుడు శంఖనాద అరవింద్‌(7) మరణించారు. దాదాపు 250కిపైగా చిత్రాల్లో నటించిన అరవింద్‌ కరోనాతో పోరాడుతూ తదిశ్వాస విడిచారు. కోవిడ్‌19 సోకడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాసకోశ సమస్య తీవ్రమైంది. దీంతో శుక్రవారం కన్నుమూశారు. దీంతో శాండల్‌వుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

పునీత్‌ రాజ్‌ కుమార్‌ బాల్యంలో నటించిన `బెట్ట దహువు` చిత్రంలో శంఖనాద కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు `ఆగంతుక`, `జ్ఞానగంగే`, `ఆపరిచిత` వంటి చిత్రాల్లో నటించారు. ఆయన నటుడు కాశీనాథ్‌కి ఆప్తుడు. అరవింద్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన భార్య రమ ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో కన్నుమూయడం విచారకరం. బెంగళూరులోనే కరోనా నిబంధనలతో అంత్యక్రియలు జరిపారు.