మీ నెక్ట్స్ సినిమా ఎవరితో..? బాలీవుడ్ లో చేస్తున్నారా..? టాలీవుడ్ లో చేస్తున్నారా..? కెజియఫ్ 3 నా.. ఇంకెవరైనా స్టార్ డైరెక్టర్ తో చేస్తున్నారు.. లేక ఇంకా కన్ ఫార్మ్ అవ్వలేదా.. ఇలా వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వారికి ఒక్క ఆన్సర్ తో ఇచ్చిపడేశాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. 

కన్నడ నాట యంగ్ హీరోగా ఉన్న యశ్.. కేజీఎఫ్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కేజీఎఫ్ రిలీజ్ కు ముందు అసలు ఈ హీరో కాని.. కన్నడ సినిమాలు కాని ఎవరికీ తెలియవు. అటువంటింది. ముందు వరకు కన్నడ సినీ పరిశ్రమకు తప్ప బయటి వాళ్లకు ఎక్కువగా తెలియని యశ్ ఈ సినిమాలతో దేశమంతా ఫేవరేట్ అయ్యాడు. కేజీఎఫ్ 2 సినిమా అయితే ఏకంగా 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని మార్చేసింది.

ఇక కన్నడ ప్రజలతో పాటు.. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ యష్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ వల్ల వచ్చిన ఇమేజ్ తో.. యష్ చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో భారీ బడ్జెట్ సినిమాలు... స్టార్ డైరెక్టర్లతో మాత్రమే సినిమా చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే రెండు మూడేళ్లు అవుతున్నా.. యష్ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే యశ్ నెక్స్ట్ సినిమాపై మాత్రం అనేక రూమర్స్ వచ్చాయి. 

యష్ నెక్ట్స్ కేజీఎఫ్ 3 తీస్తాడని కొన్నాళ్లు ప్రచారం జరగ్గా.. కొంత మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. అంతే కాదు యష్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో.. గెస్ట్ రోల్స్ చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం యశ్ మలయాళం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో యష్ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు.. అంతే కాదు ఘాటుగా సమాధానం కూడా చెప్పాడు. 

తాజాగా యశ్ ఫ్యామిలీతో కలిసి ఓ ఆలయానికి వెళ్లాడు. అయితే యష్ అక్కడికి వచ్చాడని తెలిసి కెజియఫ్ స్టార్ ను చూడటానికి భారీగా అభిమానులు, మీడియా కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా యశ్ ని రకరకాల ప్రశ్నలతో కాస్త విసిగించినంత పనిచేశారు. అందులో ముఖ్యంగా అందరు ఎదరుచూస్తున్నట్టుగానే తన నెక్స్ట్ సినిమా గురించి యష్ కు ప్రశ్న ఎదురయ్యింది. దాంతో పాటు.. యష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ప్రశ్నించగా..అన్ని ప్రశ్నలకు యష్ ఓపిగ్గా సమాధానం చెప్పారు. 

 నేను ఎక్కడికి వెళ్ళను.... అంటూ బాలీవుడ్ ఎంట్రీని ఉద్దేశించి మాట్లాడారు. నేను ఉన్న చోటికే అందర్నీ రప్పిస్తాను.. నేను మాత్రం ఎక్కడికీ వెళ్ళను అన్నారు. ఇక తన నెక్స్ట్ సినిమా గురించిన వివరాలు త్వరలో వెల్లడిస్తానన్నారు యష్. దాంతో ప్రస్తుతం ఆయన చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక రాయల్ గా కన్నడ హీరో.. యశ్ మాస్ రిప్లైకి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక అభిమానులైతే రాకింగ్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది అని కాలర్ ఎగరేస్తున్నారు. మరి త్వరలో యష్ ఏం ప్రకటిస్తాడా అని అంతా చూస్తున్నారు.