యంగ్ హీరోతో ఎఫైరే.. హీరోయిన్ బ్రేకప్ కి కారణమా..?

First Published 7, Aug 2018, 11:53 AM IST
kannada heroine affair with young telugu hero
Highlights

గతంలోనే ఈ హీరోయిన్ కి నిశ్చితార్ధం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఆమె కోస్టార్ సదరు యంగ్ హీరో అని సమాచారం

కన్నడకి చెందిన ఓ యంగ్ హీరోయిన్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సక్సెస్ కారణంగా ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఓ టాప్ బ్యానర్ లో ఓ యంగ్ హీరోతో కలిసి ఆమె నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే హీరోతో ఆమె మరో సినిమా కూడా చేయబోతుంది. అయితే గతంలోనే ఈ హీరోయిన్ కి నిశ్చితార్ధం జరిగింది.

కానీ ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఆమె కోస్టార్ సదరు యంగ్ హీరో అని సమాచారం. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కూడా ఆమె ఈ కుర్ర హీరోతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుందట. వీరిద్దరూ కలిసి ఓ పార్టీలో సన్నిహితంగా మెలగడం పలువురి కంట పడింది. ఇదే విషయాన్ని ప్రశ్నించడానికి ఆమెకి కాబోయే భర్త ఫోన్ చేస్తున్నా.. ఆమె మాత్రం ఆన్సర్ చేయడం లేదట.

కెరీర్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న తరుణంలో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవ్వాలని ఆమె అనుకోవడం లేదట. కొంతకాలం పటు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిందట.

loader